
నలబై మందికిపైగా మరణిస్తే బాధ్యత లేదా? : ఎంపీ కనిమొళి
కరూర్ తొక్కిసలాట ఘటనపై డీఎంకే ఎంపీ కనిమొళి తమిళ వెట్రి కళగం వ్యవస్థాపకుడు, సినీ నటుడు విజయ్ పై, ఆ పార్టీ ప్రతినిధులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. కరూర్ ర్యాలీలో 41 మంది మరణిస్తే టీవీకే నాయకులు ఎవరూ బాధ్యత వహించడం లేదు. ఈ విషాదానికి సంబంధించి పార్టీ నాయకులు బాధ్యత వహించాలని అన్నారు. సంఘటన తరువాత మీరు అక్కడి నుంచి వెళ్లిపోయారు. కనీసం బాధితులను పరామర్శించలేదు. బాధ్యతాయుతమైన ఏ నాయకుడు కూడా ఈ విధంగా చేయడని విజయ్ ను ఉద్దేశించి ఆమె మాట్లాడారు. ప్రజలు మిమ్మల్న చూడడానికి వచ్చారు. మీరు అక్కడి నుంచి వెళ్లిపోయినా అక్కడ ఉన్న మీ పార్టీ నాయకులు కూడా వారిని పలుకరించలేదు. కనీసం అక్కడ బాధితులకు సహయం చేయడానికి కూడా మీ నాయకులు ఎవరూ లేరు. ఇది ప్రజల ప్రాణాల పట్ల మీకున్న నిబద్ధత? ఎంత నిర్లక్ష్యం వహించారు. పెను విషాదం చోటు చేసుకుంటే కనీసం పరామర్శించడానికి తీరికలేదా అని టీవీకే నాయకులను ప్రశ్నించారు.
బాధిత కుటుంబాలకు అండగా నిలబడండి
తొక్కిసలాట సంఘటనకు సంబంధించి ఇతరులపై నిందలు వేయడానికి బదులుగా అక్కడ బాధిత కుటుంబాలకు అండగా నిలబడటం పై దృష్టి సారిస్తే బాగుంటుందని హితవు పలికారు. టీవీకే నాయకులు ఇవేవి చేయకుండా ఇతరులపై నిందను మోపడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ టీవీకే ఘటనుకు బాధ్యులుగా డీఎంకే పై ఆరోపణలు చేస్తుంది.ఎంత మాత్రం సబబు కాదు. సీఎం కూడా సోషల్ మీడియాలో పుకార్లు వ్యాప్తి చేయొద్దని కోరారు. ఇది నిందించికోనే సమయం కాదు.బాధితులకు అండగా నిలిచే సమయమన్నారు. ప్రభుత్వం కూడ రిటైర్డ్ జస్టిస్ తో కూడిన ఏకసభ్య కమిషన్ వేసింది. వారు కూడా కరూర్ స్థలాన్ని పరిశీలించారు.
బాధితులతో మాట్లాడుతున్నారు. నివేదిక వచ్చిన తరువాత బాధ్యులు ఎవరో తేలుతుంది. బాధిత కుటుంబాల కలలను విచ్చిన్నం చేసిందెవరు త్వరలోనే తేలుతుందన్నారు. విద్యాశాఖ మంత్రి అన్భిల్ మహేశ్ అంతకంటే ముందు రోజు మాట్లాడుతూ ఈ విషాదానికి కారణమైన వారిపైనా కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కమిషన్ దర్యాప్తు చేస్తోంది. నివేదిక వచ్చిన అనంతరం బాధ్యులపై తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పలు సూచనలు చేశారు. జీవితం చాలా విలువైందని, విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలని, ఆ తరువాతే ఇతరులను అనుసరించాలన్నారు. విద్యార్థులు విద్యకు, తమ భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
కరూర్ ఘటన స్థలాన్ని పరిశీలించిన ఎన్డీయే కమిటీ
ఇక్కడి మా బృందం తొక్కిసలాట ఘటనకు సంబంధించి సెప్టెంబర్ 26న ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చింది. ఇటువంటి దుర్ఘటన భారతదేశ రాజకీయ చరిత్రలో ఇంతకు ముందు జరగలేదన్నారు. రాజకీయ ర్యాలీలు సరైన పద్ధతిలో నిర్వహిస్తారు.ర్యాలీకి వచ్చిన ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. ప్రభుత్వాధికారులు, కార్యక్రమ నిర్వహకులు ఏర్పాట్లుచేయాలి. కానీ ఇవేవి ఇక్కడి పట్టించుకున్నట్లు లేదు. మేం ఘటన స్థలాన్ని పరిశీలించాం. ఇటువంటి ప్రదేశంలో అంత జనాలు వచ్చినప్పుడు కంట్రోల్ చేయకపోవడం. విజయ్ కూడా అత్యంత అభిమానం నటుడు, ఆయన కూడా సభకు రమ్మని అంతమందికి పిలుపునివ్వడం సరికాదు. ఇప్పుడు ఈఘటనకు ఎవరు బాధ్యులు? ఎవరూ వారి కుటుంబాల్లో కోల్పోయిన వారిని తీసుకొస్తారు. ఈ ఘటన ప్రాంతాన్ని, ఆసుపత్రిలో బాధితులను పరామర్శిస్తుంటే దుఖం వస్తోంది. అందరూ ఇక్కడ విఫలమయ్యారు. ఇంత పెను విషాదం జరిగితే దురదృష్టం అని ఊరుకోవడం సరికాదన్నారు.
సామాన్యులు ప్రాణాలు కోల్పోయారు
ఈ తొక్కిసలాట ఘటనలో బాధితులను చుట్టుపక్కల 3–4 ఆసుపత్రులు ఉన్నప్పటికీ గాయపడిని వారిని అక్కడికి తీసుకెళ్లలేదు. అందరిని ఇక్కడే చేర్చారు. దీంతో చాలా సమయం పట్టిందని ఎంపీ అనురాగ్ ఠాకూర్ వాపోయారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేం జిల్లా అధికారులను కలుస్తాం. ప్రశ్నలు తయారు చేసి వారిని అడుగుతాం. ఇక్కడ నిజమేమిటంటే సామాన్యుల ప్రాణాలు కోల్పోవడం. ఎవరూ ఈ సంఘటనకు బాధ్యత వహిస్తారు. దర్యాప్తు పారదర్శకంగా జరగాలి. సుప్రీం కోర్టు న్యామమూర్తితో విచారణ చేయించాలని మేం కోరుతాం. అప్పుడే వాస్తవాలు బయటకు వస్తాయి. నిష్పాక్షపాతంగా దర్యాప్తు జరగాలన్నారు. అధికారులు, ప్రభుత్వం సమాధానం చెప్పాలి. త్వరగా వారు విచారణ చేస్తారని మేం అనుకుంటున్నాం. తదనంతరం నివేదికను బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాకు అందజేస్తామని వివరించారు. సంఘటన జరిగిన రోజు ఇంటలిజెన్స్, పోలీసులు తీసుకన్న చర్యలను కూడా ఆయన ప్రశ్నించారు. ఇంతమంది అధికారులు ఉండి భారీగా జనాలు వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు. ఈ స్థాయిలో వచ్చినప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోవాలో వారికి తెలియదా? పై గా పార్టీ నాయకులు, కార్యక్రమ నిర్వహాకులు వాటర్ బాటిళ్లు విసిరేశారు అని ఆగ్రహాం వ్యక్తం చేశారు.
ఎన్టీయే కమిటీ ఏర్పాటు
తొక్కిసలాటకు సంబంధించి బీజేపీ ఎన్డీయే ప్రతినిధి బృందాన్ని ఏర్పాటు చేసింది. హేమమాలిని కన్వీనర్ గా ఉన్న ఈ బృందంలో ఎంపీలు బీజేపీ ఎంపీలు అనురాగ్ ఠాకూర్ , తేజస్వీ సూర్య, బ్రజ్ లాల్, అప్రాజిత సారంగి, రేఖా శర్మ, శివసేనకు చెందిన శ్రీకాంత్ షిండే, టీడీపీ నుంచి పుట్టా మహేష్ కుమార్ ఉన్నారు.
