Let's talk: editor@tmv.in
నర్సీపట్నంలో వైసిపికి బిగ్ షాక్

నర్సీపట్నంలో వైసిపికి బిగ్ షాక్

FL - YUGDR
10 అక్టోబర్, 2025

నర్సీపట్నం మున్సిపాలిటీ మాజీ మున్సిపల్ చైర్ పర్సన్, జి. ఆదిలక్ష్మి, మాజీ

మున్సిపల్ వైస్ చైర్మన్ గొలుసు నరసింహమూర్తి లు గురువారం తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరితోపాటు వైసీపీ సీనియర్ నాయకుడు జీ. నాగేశ్వరరావు (జి.ఎన్. ఆర్) కూడా టిడిపిలో చేరారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ నర్సీపట్నం మెడికల్ కాలేజ్ సందర్శన సమయంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కౌన్సిలర్లుగా గెలిచి, గత కొంతకాలంగా మాజీ ఎమ్మెల్యే గణేష్ కు దూరంగా ఉంటున్న ఇద్దరు కౌన్సిలర్లు గురువారం టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. నర్సీపట్నం మున్సిపాలిటీ 17వ వార్డు కౌన్సిలర్ గా గెలిచి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున నర్సీపట్నం మున్సిపల్ చైర్ పర్సన్ గా పనిచేసిన జి. ఆదిలక్ష్మి గురువారం టిడిపి కండువా కప్పుకున్నారు. ముందుగా జరిగిన ఒప్పందం ప్రకారం రెండు సంవత్సరాల తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆదిలక్ష్మి ని చైర్పర్సన్ పదవి నుంచి తొలగించింది. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో కొన్ని నెలల క్రితమే పార్టీ నుంచి ఆమెను సస్పెండ్ చేశారు. ఆమె సోదరుడు రాజకీయంగా 17వ వార్డులో రెండుసార్లు కౌన్సిలర్లుగా వైసీపీని గెలిపించడంలో కీలక పాత్ర పోషించిన జి. నాగేశ్వరరావు లు ఇద్దరు తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరితోపాటు గత ఐదు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలోను, ఆ తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోను కొనసాగుతున్న ఐదవ వార్డు కౌన్సిలర్, నర్సీపట్నం మున్సిపాలిటీ వైస్ చైర్మన్ గా పనిచేసిన గొలుసు నరసింహ మూర్తి కూడా తెలుగుదేశం కండువా కప్పుకున్నారు. ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.