Let's talk: editor@tmv.in
నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా

నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా

Aravind Maryada Reddy
15 సెప్టెంబర్, 2025

తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానంటూ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ టికెట్ మీద గెలిచిన దానం.. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. గత లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా సికింద్రాబాద్ ఎంపీగా కూడా పోటీ చేశారు. అయితే ఇటీవల పార్టీ ఫిరాయించిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు తాము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని.. కేవలం మర్యాదపూర్వకంగా, నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం మాత్రమే ముఖ్యమంత్రిని కలుసుకున్నామని స్పీకర్కు చెప్పుకున్నారు. తమ మెడలో కప్పింది కాంగ్రెస్ జెండా కాదని.. కేవలం మూడు రంగుల కండువా మాత్రమేనని చెప్పారు. ఇదిలా ఉంటే తాజాగా దానం నాగేందర్ మాత్రం అందుకు విరుద్ధంగా వ్యాఖ్యానించడం గమనార్హం. తాను బీఆర్ఎస్ పార్టీ టికెట్ మీద గెలిచినప్పటికీ కాంగ్రెస్ పార్టీలో చేరానని.. ప్రస్తుతం కాంగ్రెస్ సభ్యుడిగానే ఉన్నానని చెప్పడం గమనార్హం. మరి దానం ఏ ఉద్దేశ్యంతో ఇటువంటి వ్యాఖ్యలు చేశారు? ఆయన పార్టీ మారబోతున్నారా? అన్న చర్చ జరుగుతోంది. రాజీనామా చేసి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగాలనుకుంటున్నారా? లేదంటే జూబ్లీహిల్స్ టికెట్ మీద ఆశలు పెట్టుకున్నారా? అన్న చర్చ కూడా సాగుతోంది.

దానం వ్యాఖ్యల వెనుక వ్యూహం ఏమిటి?

దానం నాగేందర్, ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ టికెట్ మీద గెలుపొందిన సీనియర్ నేత. అయితే, గత ఏడాది కాలంలో ఆయన కాంగ్రెస్ వైపు మొగ్గు చూపి, సికింద్రాబాద్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా ఉండటం, ఫిరాయింపు చట్టం (ఆంటీ-డిఫెక్షన్ లా) ప్రకారం వేటు పడే అవకాశాలు ఉన్నాయన్న చర్చ జరుగుతోంది. తాజాగా ఆయన 'నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను' అంటూ ప్రకటించడం ద్వారా, తన రాజకీయ భవిష్యత్తును స్పష్టం చేసుకునే ప్రయత్నం చేసినట్టు కనిపిస్తోంది.

రాజీనామాకు సంకేతమా?

దానం రాజీనామా చేయాలన్న సంకేతంగా భావించవచ్చు. ఫిరాయింపు చట్టం ప్రకారం, పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్ వేటు వేయవచ్చు. ఇటీవలి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు తమను బీఆర్ఎస్లోనే ఉన్నామని చెప్పడం ద్వారా వేటు నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ దానం మాత్రం ఓపెన్గా కాంగ్రెస్లో ఉన్నానంటూ చెప్పడం, ఆయన రాజీనామా చేసి ఉప ఎన్నికలో పోటీ చేయాలనుకుంటున్నారన్న సంకేతం. ఇది ఆయనకు కాంగ్రెస్ హైకమాండ్తో ఉన్న సన్నిహిత సంబంధాలను బలపరుస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆయనకు మంచి ట్యూనింగ్ ఉండటం, రాజీనామా తర్వాత ఖైరతాబాద్లో మళ్లీ పోటీ చేసే అవకాశాలను పెంచుతుంది.

జూబ్లీహిల్స్ టికెట్ మీద ఆశలు పెట్టుకున్నారా?

జూబ్లీహిల్స్ లో త్వరలో జరగబోతున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయాలన్న ఉద్దేశ్యంతోనే దానం ఇటువంటి వ్యాఖ్యలు చేశారా? అన్న చర్చ కూడా సాగుతోంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఆయనకు సుపరిచితమైన ప్రాంతం. గతంలో ఆయన ఈ సీటు నుంచి పోటీ చేసి గెలుపొందారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. దానం కాంగ్రెస్లో ఉన్నానంటూ ప్రకటించడం ద్వారా, జూబ్లీహిల్స్ టికెట్ కోసం లాబీయింగ్ చేస్తున్నట్టు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దానం నాగేందర్ కు ఇటు జూబ్లీహిల్స్, అటు ఖైరతాబాద్ ఈ రెండు నియోజకవర్గాల్లోనూ పట్టు ఉంది. ఆయన సీనియర్ నేత. అయితే పార్టీ ఫిరాయించడం వల్లే ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. ఒక వేళ కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద పోటీ చేసి గెలుపొందితే అప్పుడు సునాయాసంగా టికెట్ దక్కే అవకాశం ఉంటుంది. మరి దానం ఏ వ్యూహంతో ఇటువంటి వ్యాఖ్యలు చేశారో వేచి చూడాలి.

వేటు పడే అవకాశం ఉందా?

మొత్తం బీఆర్ఎస్ పార్టీ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారు. అయితే వీరిలో దానం నాగేందర్ పార్టీ ఫిరాయించినట్టు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. దీంతో ఆయన మీద ఫిరాయింపుల వ్యతిరేక చట్టం వర్తించే అవకాశం ఉంది. ఫిరాయింపు చట్టం ప్రకారం వేటు పడితే, ఆయన ఎమ్మెల్యే పదవి కోల్పోతారు. ఇది రాజకీయంగా నష్టం. మరోవైపు, ఇతర ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లోనే ఉన్నామంటూ సేఫ్ గేమ్ ఆడుతుంటే.. దానం మాత్రం బహిరంగంగా తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని వ్యాఖ్యానించడం గమనార్హం. తాను గతంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పోటీచేయడంతో ఫిరాయింపు చట్టం వర్తించేందుకు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. అందుకు ఫిరాయింపు చట్టం కింద వేటు పడే కంటే ముందే తానే పార్టీ పారితే మేలు అని దానం భావిస్తున్నట్టు తెలుస్తోంది.

ఖైరతాబాద్ లో రాజకీయ పరిస్థితి ఏమిటి?

ఖైరతాబాద్ నియోజకవర్గం హైదరాబాద్ సెంట్రల్లో ఉండటం వల్ల అర్బన్ వోటర్లు, వ్యాపార వర్గాలు ఇక్కడ ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. దానం గత ఎన్నికల్లో ఇక్కడ బలమైన మెజారిటీ సాధించారు. రాజీనామా చేసి పోటీ చేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండటం వల్ల అభివృద్ధి పనులు, వోటర్ల మద్దతు ఆయనకు ప్లస్ పాయింట్. అయితే, బీఆర్ఎస్ బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపితే పోటీ తీవ్రమవుతుంది. బీజేపీ కూడా ఇక్కడ బలపడుతున్న నేపథ్యంలో, త్రిముఖ పోరు అయితే దానం గెలుపు కష్టమే. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి.. దానం నాగేందర్ కు గెలుపు అవకాశాలు లేకపోలేదు. మరోవైపు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి బలమైన అభ్యర్థి లేకపోవడం దానం నాగేందర్ కు కలిసివచ్చే అవకాశం ఉంది. ఒకవేళ దివంగత నేత పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డికి బీఆర్ఎస్ టికెట్ ఇస్తే పోటీ తీవ్రతరం అయ్యే అవకాశం ఉంది.

జూబ్లీహిల్స్ పరిస్థితి ఏమిటి?

జూబ్లీహిల్స్ నియోజకవర్గం హై-ప్రొఫైల్ ఏరియా, ఫిల్మ్ ఇండస్ట్రీ, వ్యాపారులు ప్రధానం. దానం నాగేందర్ కు ఈ నియోజకవర్గంలోనూ పట్టు ఉంది. కొన్ని బస్తీలు, మురికివాడల్లో ఆయనకు పట్టు ఉంది. దీనికి తోడు కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ కూడా కాంగ్రెస్ పార్టీకి కలిసివచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ టికెట్ మీద పోటీ చేస్తే, ప్రభుత్వ సపోర్ట్తో గెలుపు సాధ్యమే. మాగంటి గోపీనాథ్ కుటుంబసభ్యులకు టికెట్ ఇస్తే ఆ సింపతి కొంచెం ప్రభావం చూపే అవకాశం ఉంది. రాజీనామా చేసి పోటీ చేయడం ద్వారా దానం ఫిరాయింపు వివాదం నుంచి బయటపడతారు. కాంగ్రెస్లో మంచి పొజిషన్, మంత్రి పదవి అవకాశాలు పెరుగుతాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొంది.. మంచి పదవి పొందవచ్చని దానం భావిస్తున్నారు. మరి ఆయన ఆశలు ఫలిస్తాయా? ఆయన గెలుస్తారా? అసలు ఆయనకు కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కుతుందా? అన్నది వేచి చూడాలి.

నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా - Tholi Paluku