Let's talk: editor@tmv.in
నేడు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

నేడు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

Shaik Mohammad Shaffee
23 సెప్టెంబర్, 2025

నగర ప్రజలకు ట్రాఫిక్ పోలీసులు కీలక సూచనలు చేశారు. మిలాద్-ఉన్-నబీ ఊరేగింపు సందర్భంగా నేడు నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపారు. ఇవాళ ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని ప్రకటించారు.

ఊరేగింపు మార్గం

నగరంలో ప్రధానంగా మిలాద్-ఉన్-నబీ ఊరేగింపులు ఐదు మార్గాల గుండా సాగుతాయి. అవి: ఫలక్‌నుమా నుండి చార్మినార్ మీదుగా వోల్టా హోటల్ వరకు; యహియా పాషా దర్గా నుండి వోల్టా హోటల్ వరకు వెళ్లి తిరిగి అదే మార్గంలో; మక్కా మసీదు నుండి నాంపల్లిలోని హజ్ హౌస్ వరకు; మక్కా మసీదు నుండి వోల్టా హోటల్ వరకు; పత్తర్‌ఘట్టి నుండి అలిజా కోట్లా వరకు.

ట్రాఫిక్ మళ్లింపులు

మిలాద్-ఉన్-నబీ ఊరేగింపుల దృష్ట్యా ఫలక్‌నుమా, ఇంజిన్ బౌలి, నాగుల్చింత క్రాస్ రోడ్, హిమ్మత్‌పురా జంక్షన్, వోల్గా, హరిబౌలి, పంచ్ మొహల్లా, చార్మినార్, గుల్జార్ హౌజ్, పత్తర్‌ఘట్టి, మదీనా జంక్షన్, ఢిల్లీ గేట్, నయాపూల్, ఎస్.జె. రొటరీ జంక్షన్, దారుల్షిఫా, పురానీ హవేలి, మిరాల్ మండి, ఎతెబార్ చౌక్, అలిజా కోట్లా, బిబి బజార్, వోల్టా హోటల్, అఫ్జల్‌గంజ్ టి జంక్షన్, ఉస్మాన్ గంజ్, ఎం.జె. మార్కెట్ జంక్షన్, తాజ్ ఐలాండ్, నాంపల్లి టి జంక్షన్, హజ్ హౌస్, ఏ.ఆర్. పెట్రోల్ పంప్, నాంపల్లి వద్ద ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని హైదరాబాద్ పోలీసులు తెలిపారు. కాబట్టి నగర వాహనదారులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని సూచించారు.

చార్మినార్ బంద్

మిలాద్-ఉన్-నబీ ఊరేగింపు కారణంగా ఆదివారం పాతబస్తీలోని పర్యాటక ప్రదేశాలు మూసివేయనున్నట్లు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వెల్లడించింది. చార్మినార్‌తో పాటు ఓల్డ్ సిటీలోని స్మారక చిహ్నాలు, పలు పర్యాటక ప్రదేశాలు మూసివేయనున్నట్లు పేర్కొంది. సెప్టెంబర్ 6న హైదరాబాద్‌లో వినాయక నిమజ్జనం సందర్భంగా కూడా చార్మినార్‌ను మూసివేసిన విషయం తెలిసిందే.

నేడు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు - Tholi Paluku