Let's talk: editor@tmv.in
నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు

నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు

FL - SUNL
18 సెప్టెంబర్, 2025

తొలిపలుకు, ఏపీ;* గురువారం నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. ఉదయం 9 గంటలకు శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఉన్నతస్థాయి సమీక్ష చేపట్టారు.. సమీక్షకు హాజరైన సీఎస్, డీజీపీ, ఉన్నతాధికారులు.. సమావేశాల సందర్భంగా అసెంబ్లీ వద్ద పటిష్ట భద్రత కల్పించే విషయమై వారు చర్చించారు. గురువారం ప్రశ్నోత్తరాలతో ప్రారంభంకానున్న ఉభయసభలు.. ప్రశ్నోత్తరాల తర్వాత శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ భేటీ. అయింది. శాసనసభ సమావేశాల నిర్వహణపై బీఏసీలో నిర్ణయం తీసుకున్నారు..

జగన్ అసెంబ్లీకి వస్తారా రారా ?

కేవలం 11 మంది ఎమ్మెల్యేల బలం ఉన్న తమకు ఆ నిష్పత్తిలో అతి తక్కువ సమయం ఇస్తారని.. పైగా సభలో తనను అవహేళన చేస్తున్నారని భావిస్తున్న వైయస్ జగన్ ఆర్నెల్లుగా సభకు వెళ్లడం లేదు.. అయితే జగన్ కు అధికారపక్షం అంటే భయం వేస్తోందని.. అందుకే సభకు రావడం లేదని మంత్రులు.. టీడీపీ ఎమ్మెల్యేలు సైతం విమర్శిస్తున్నారు.. తమకు ప్రతిపక్ష హోదా ఇచ్చి.. సభలో తమ గళం వినిపించేందుకు సమయం ఇస్తేనే వస్తాం తప్ప.. తెలుగుదేశం చేతిలో అవమానాలు ఎదుర్కొనడానికి తామెందుకు సభకు రావాలన్నది వైసిపి వాదనగా ఉన్నది. మరోవైపు వైయస్ జగన్ సభకు హాజరుకాకపోవడాన్ని తెలుగుదేశం ఒక అవకాశంగా తీసుకుని ఆయన్ను విమర్శిస్తోంది.. అయితే చంద్రబాబు కూడా ఎన్నికలకు రెండున్నరేళ్ల ముందునుంచే సభకు వెళ్లడం మానేశారని.. ఎన్నికల్లో గెలిచాక మాత్రమే వస్తున్నారని.. అదేదో చంద్రబాబు చేస్తే ఘనకార్యం.. మేము చేస్తే రాజ్యాంగ ఉల్లంఘన అని ఎలా అంటారన్నది వైసిపి వెర్షన్..

ఇదిలా ఉండగా వైయస్ జగన్ హయాంలో మొదలైన మెడికల్ కాలేజీలను ప్రయివేటుకు ఇచ్చేస్తాం అంటూ బాబు చేసిన ప్రకటన రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపింది.. ఇరవయ్యేళ్ళ పాలనలో ఒక్క కాలేజీ కూడా తీసుకురాని చంద్రబాబుకు వైయస్ జగన్ తెచ్చిన కాలేజీలు ప్రయివేటుకు ఎలా అమ్ముతారని ఆరోపిస్తూ.. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా వైసిపి ఆందోళనలు చేపడుతోంది. ఇప్పటికే కాలేజీలవద్ద వార్షికోత్సవాలు నిర్వహించి కేక్ కటింగ్ వంటి కార్యక్రమాలు నిర్వహించారు.. ఈనెల 19న కూడా యువత, విద్యార్థులతో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో వాడిగా వేడిగా చర్చ జరిగే అవకాశం ఉంది.. దీంతోబాటు ఉల్లి, టమాటా రైతుల సమస్యలు సభలో ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది.. యూరియా కొరత,, రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఇక్కట్లను వైసిపి ప్రస్తావించాలని చూస్తోంది.. దీనికి అధికారపక్షం ఏ మేరకు అవకాశం ఇస్తుందో చూడాలి.

నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు - Tholi Paluku