Let's talk: editor@tmv.in
నెట్టింట్లో ‘అధిరా’ హవా

నెట్టింట్లో ‘అధిరా’ హవా

Thaduri Lalitya
23 సెప్టెంబర్, 2025

కొత్త కథలకు కేరాఫ్ గా ఆడియన్స్ చెప్పుకునే దర్శకుడు ప్రశాంత్ వర్మ. టాలీవుడ్ కు హనుమాన్ సినిమాతో సూపర్ హీరో జానర్‌ పరిచయం చేశారు. జాంబీ రెడ్డి, అ!, వంటి విభిన్న కథలను తెరపైకి తీసుకువచ్చారు. ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్ట్ ‘అధిరా’ తో ఆడియన్స్ ను ఫుల్​ ఖుష్ చేసేందుకు రెడీ అయ్యాడు. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో ఎస్‌.జే. సూర్య, కల్యాణ్ దాసరి ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని రివాజ్ రమేష్ దుగ్గల్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే హనుమాన్ సినిమా లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ప్రశాంత్ వర్మ అంటేనే విజువల్ వండర్ అనే మాట రాకమానదు. దీనితో పాటు ఏడాదికో సినిమా పివిసియూ నుంచి బైటికొస్తుంది అనేది ఆడియన్స్ కన్ఫర్మ్ చేసుకున్నారు.

ప్రశాంత్ వర్మ యూనివర్స్ లో తాజాగా అధీర సినిమాకి సంబంధించిన అప్‌డేట్‌ను షేర్ చేశారు. ప్రశాంత్ వర్మ విజన్ మరో లెవెల్‌ అంటూ ఇప్పటికే బజ్ ఓ రేంజ్ లో ఉంది. టీజర్, ట్రైలర్ రాగానే అధీర హైప్ అంతకు మించి అభిమానుల్లో ఆసక్తి పెంచుతుంది అనడం లో డౌటే లేదు. సినిమాటోగ్రఫీ శివేంద్ర, శ్రీచరణ్ పాకాల అందిస్తున్న బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకి కీలక బలం కానుంది. ఇక ప్రొడక్షన్ డిజైనర్ శ్రీ నాగేంద్ర తంగాల రూపొందిస్తున్న విభిన్నమైన సెట్లు ఇప్పటికే ఫిల్మ్ ఇండస్ట్రీలో చర్చనీయాంశమయ్యాయి.

సోషల్ మీడియాలో పోస్టర్ పడగానే క్షణాల్లో వైరల్ అయిపోయింది. పోస్టర్ లో హీరోని చూపించిన విధానం బట్టి రాక్షసపు కొమ్ములు, కర్కశమైన చూపు వంటివి కథలో పాత్రను విధంగా తెరకెక్కించనున్నారు అనేది అంచనా వేస్తున్నారు అభిమానులు. ప్రపంచాన్ని చీకటి కమ్మేసినప్పుడు… వెలుగురూపంలో ఆశాకిరణం పుడుతుంది అనే లైన్‌తో పోస్టర్‌ విడుదలైంది. ‘అధీర’ ఫస్ట్ గ్లింప్స్‌ను ‘ఓజీ’ సినిమాలో అటాచ్ చేయాలని ఐడియా కూడా మేకర్స్ లో ఉన్నట్టు సమాచారం.

నెట్టింట్లో ‘అధిరా’ హవా - Tholi Paluku