Let's talk: editor@tmv.in
నిజాం నిరంకుశం అంతమైనరోజు

నిజాం నిరంకుశం అంతమైనరోజు

Gaddamidi Naveen
17 సెప్టెంబర్, 2025

నిజాం నిరంకుశత్వం అంతమైన రోజు సెప్టెంబర్ 17 అని ఈటల రాజేందర్ అభివర్ణించారు. సెప్టెంబర్ 17 ఒక ఉద్యమం, ఒక ఉద్వేగం అని కొనియాడారు. చరిత్రలో నిలిచిపోయిన సందర్భమని పేర్కొన్నారు. భావి తరాల పోరాటానికి తెలంగాణ సాయుధ పోరాటం స్ఫూర్తిగా నిలిచిందని చెప్పారు. మంగళవారం ఆయన హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ.. సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవం మాత్రమే కాక ప్రధాని మోడీ జన్మదినం కూడా అని గుర్తు చేశారు. మోడీ జన్మదినం సందర్భంగా దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు ఎన్నో కార్యక్రమాలు చేయబోతున్నారని పేర్కొన్నారు. ప్రధాని మోడీకి తాను కూడా ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్టు చెప్పారు. మోడీ నాయకత్వంలో గుజరాత్ ఎంతో గొప్పగా అభివృద్ది చెందిందని పేర్కొన్నారు. ప్రధాని మోడీ భారత దేశాన్ని ప్రపంచచిత్రపటంలో గొప్పగా నిలబెట్టారని కొనియాడారు. పేద దేశంగా ముద్రపడ్డ భారత్ నేడు ప్రధాని మోడీ నాయకత్వంలో అత్యంత వేగంగా అభివృద్ది చెందుతుందని తెలిపారు. రాబోయే రోజుల్లో మోడీ మరింత ఆరోగ్యంగా జీవించి దేశాన్ని మరింత వేగంగా అభివృద్ది చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు.

నిజాం నిరంకుశం అంతమైనరోజు - Tholi Paluku