
నిజాంకి దిమ్మతిరిగేలా చేసిన సర్ధార్
హైదరాబాద్ రాష్ట్రం భారతదేశంలో విలీనమై ఈ ఏఢాది సెప్టెంబర్ 17 నాటికి 77 సంవత్సరాలు పూర్తవుతుంది. అయితే ఈ విమోచనం సాఫీగా జరగలేదు. దీని వెనుక నిజాం నిరంకుశ పాలన, రజాకార్ల హింస, భారత సైన్యం చేపట్టిన 'ఆపరేషన్ పోలో'వంటి అనేక చారిత్రక ఘట్టాలు ఉన్నాయి. హైదరాబాద్ సంస్థానం నిజాం పాలనలో ఉండేది. ఆ కాలంలో అత్యధిక, అత్యల్ప వర్గాల మధ్య ఆర్థిక, సామాజిక వ్యత్యాసాలు ఉండేవి కావు. కానీ పాలకుడు మహమ్మదీయుడు కావడంతో ఆ వర్గానికి చెందినవారు కొంత అదనపు సదుపాయాలను పొందేవారు. అయితే గ్రామీణ ప్రాంతాల్లోని ముస్లింలు కూడా హిందువులతో సమానంగా వెనకబడి ఉండేవారు. నిజాం పాలనలో మైనారిటీ వర్గాలు కూడా అణచివేతకు గురయ్యారు. భూస్వామ్య వర్గాలు నవాబుకు అండగా నిలిచేవి.
రజాకార్ల ఆగడాలు
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత హైదరాబాద్ను భారతదేశంలో విలీనం చేయకుండా నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీఖాన్ మొండికేశారు. హైదరాబాద్ను ఒక ప్రత్యేక దేశంగా ప్రకటించుకోవాలని భావించారు. ఈ సమయంలోనే ఇత్తెహాదుల్ ముస్లిమీన్ పార్టీకి చెందిన ఖాసిం రజ్వీ నేతృత్వంలోని రజాకార్ల బృందం ఉగ్రరూపం దాల్చింది. వీరు హిందువులపై, నిజాం పాలనకు వ్యతిరేకంగా ఉన్నవారిపై విచక్షణారహితంగా దాడులు, హింసకు పాల్పడ్డారు. గ్రామాల్లో ఇళ్లలోకి చొరబడి ఆస్తులను లూటీ చేయడం, అమానవీయ హింసకు పాల్పడటం, హత్యలు చేయడం వంటి ఘోరాలకు ఒడిగట్టారు. ఈ రజాకార్ల ఆగడాలు మితిమీరిపోవడంతో ప్రజల్లో భయాందోళనలు పెరిగిపోయాయి.
పటేల్.. ఆపరేషన్ పోలో
రజాకార్ల హింస, నిజాం వైఖరిని గమనించిన నాటి హోంమంత్రి, ఉక్కుమనిషి ప్రసిద్ధి చెందిన సర్దార్ వల్లభాయ్ పటేల్ హైదరాబాద్పై సైనిక చర్య తీసుకోవాలని నిర్ణయించారు. ఈ చర్యకు ఆపరేషన్ పోలో అని పేరు పెట్టారు. సాధారణంగా దీనిని పోలీసు చర్య అని ఎందుకు అంటారు అనే సందేహం చాలామందికి ఉంటుంది. వాస్తవానికి నిజాం సంస్థానం ఒక స్వతంత్ర దేశంగా వ్యవహరిస్తుండటంతో దానిపై సైనిక దాడిని అంతర్జాతీయంగా సమర్థించుకోవడం కష్టం. అందువల్ల అంతర్గత శాంతి భద్రతలను పునరుద్ధరించడానికి చేపట్టిన పోలీసు చర్యగా దీనిని పేర్కొన్నారు. దీనివల్ల నిజాం ఐక్యరాజ్యసమితిలో ఫిర్యాదు చేసినా, అంతర్జాతీయంగా భారత ప్రభుత్వంపై పెద్దగా ఒత్తిడి రాలేదు. సైనిక చర్య అన్న పదం వాడి ఉంటే అది యుద్ధంగా పరిగణించబడేది. అందుకే వ్యూహాత్మకంగా దీనిని 'పోలీసు చర్య' అని పిలిచారు. 1948 సెప్టెంబర్ 13న మేజర్ జనరల్ జె.ఎన్. చౌదరి నేతృత్వంలో భారత సైన్యం మూడు వైపుల నుంచి హైదరాబాద్ను ముట్టడించింది. ఈ చర్య కేవలం ఐదు రోజుల్లోనే ముగిసింది. సెప్టెంబర్ 18న నిజాం లొంగిపోతున్నట్లు రేడియోలో ప్రకటించారు. ఈ పోరాటంలో 1,373 మంది రజాకార్లు హతమయ్యారు. భారత సైన్యం కేవలం 10 మంది సైనికులను మాత్రమే కోల్పోయింది.
విమోచన పోరాటాలు
నిజాం నిరంకుశ పాలనపై రజాకార్ల హింసపై అనేక మంది పోరాట యోధులు తిరగబడ్డారు. జమలాపురం కేశవరావు, రావి నారాయణరెడ్డి, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య వంటి ఎందరో నాయకులు, సామాన్య ప్రజలు ఈ పోరాటంలో పాల్గొన్నారు. కవిత్వం ద్వారా ప్రజలను చైతన్యవంతం చేసిన దాశరథి, కాళోజీ, సుద్దాల హనుమంతు వంటి వారి కృషి కూడా మరువలేనిది. ఈ పోరాటాల ఫలితంగానే హైదరాబాద్ ప్రజలకు సంపూర్ణ స్వాతంత్ర్యం లభించింది.
పోలీసు చర్యగా ఎందుకు పిలుస్తారు?
ఆపరేషన్ పోలోను 'పోలీసు చర్య' అని పిలవడానికి ప్రధాన కారణం భారత ప్రభుత్వం దీనిని అంతర్జాతీయ యుద్ధంగా కాకుండా, హైదరాబాద్ సంస్థానంలో పెరిగిపోతున్న హింస, అరాచకాలను అదుపు చేసేందుకు చేపట్టిన ఒక అంతర్గత శాంతిభద్రతల చర్యగా పరిగణించింది. నిజాం పాలనలో హింస, దోపిడీ, హత్యలు వంటి నేరాలను రజాకార్లు పెద్ద ఎత్తున ప్రోత్సహించారు. ఈ నేరాలను అదుపులోకి తెచ్చేందుకు, పౌరుల భద్రతను కాపాడేందుకు భారత ప్రభుత్వం ఈ చర్యను చేపట్టింది. భారత సైన్యం ఒక 'పోలీసు శక్తి'గా వ్యవహరించి, రజాకార్ల బృందాలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేసింది.
సైనిక చర్యగా ఎందుకు అంటారు ?
ఆపరేషన్ పోలో అనేది ఒక 'సైనిక చర్య' అని కూడా పిలుస్తారు. ఎందుకంటే దీనిలో భారత సైన్యం పూర్తిగా పాల్గొంది. నిజాం ప్రభుత్వం సాయుధ బలగాలను, రజాకార్లను ఉపయోగించి ప్రజలపై దాడులు చేయడమే కాకుండా, తన స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడుకోవడానికి భారత సైన్యంతో పోరాటానికి సిద్ధపడింది. దీనిని ఎదుర్కోవడానికి భారత సైన్యం పూర్తి స్థాయి మిలిటరీ ఆపరేషన్ను చేపట్టింది. యుద్ధ ట్యాంకులు, యుద్ధ విమానాలు, భారీ ఆయుధాలు వంటి సైనిక సామగ్రిని ఉపయోగించి, నిజాం సైన్యాన్ని సులభంగా ఓడించారు.
వేలప్రాణాలు బలిదానం
తాము లొంగిపోతున్నట్లు అసఫ్జాహీ వంశస్థుడు మీర్ ఉస్మాన్ అలీఖాన్ రేడియోలో ప్రకటించడంతో వివాదం సుఖాంతమయ్యింది. నాడు పటేల్ చొరవతో ‘ఆపరేషన్ పోలో’ నిర్వహించి 77 సంవత్సరాలు పూర్తైంది. దేశానికి స్వాతంత్ర్యం లభించిన పదమూడు నెలల తరువాత హైదరాబాద్ రాష్ట్రం సెప్టెంబర్ 17న భారతదేశంలో విలీనమయ్యింది. రజాకార్ల ఊచకోతలతో పేట్రేగిపోతుంటే ఎన్నో వేలమంది ప్రాణాలు బలిదానం చేస్తే కానీ హైదరాబాద్ రాష్ట్ర ప్రజలకు సంపూర్ణ స్వాతంత్ర్యం లభించలేదు. దేశానికి స్వాతంత్ర్యం లభించిన పదమూడు నెలల తరువాత హైదరాబాద్ రాష్ట్రం సెప్టెంబర్ 17న భారతదేశంలో విలీనమై వివాదం సుఖాంతమయ్యింది. ప్రధానమంత్రి మీర్ లాయిక్ ఆలీ, రజాకార్ల నాయకుడు ఖాసిం రజ్వీ అరెస్టయ్యారు. సెప్టెంబర్ 23న భద్రతా సమితిలో తన ఫిర్యాదును నిజాం ఉపసంహరించుకున్నాడు. హైదరాబాదు భారతదేశంలో విలీనం అయినట్లుగా ప్రకటించాడు. తరువాత ఖాసీం రజ్వీ కొన్నాళ్ళు భారతదేశంలో జైలు జీవితం గడిపి, విడుదలయ్యాక పాకిస్తాను వెళ్ళి స్థిరపడ్డాడు. అక్కడే అనామకుడిలా మరణించాడు. మేజర్ జనరల్ జె.ఎన్. చౌదరి హైదరాబాదు సైనిక గవర్నరుగా బాధ్యతలు స్వీకరించి 1949 చివరి వరకు పదవిలో ఉన్నారు.
సర్దార్ పటేల్ వ్యూహాత్మక నిర్ణయం
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత హైదరాబాద్ సంస్థానం స్వతంత్రంగా ఉండాలని నిర్ణయించుకుంది. నిజాం మిర్ ఉస్మాన్ అలీ ఖాన్ తన స్వయంప్రతిపత్తిని కాపాడుకోవడానికి ప్రయత్నించారు. అయితే హైదరాబాద్ ప్రజలు భారతదేశంలో కలవాలని కోరుకున్నారు. ప్రజల ఆకాంక్షలు, రజాకార్ల హింస, అణచివేతను గమనించిన హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్, ఈ సమస్యకు సైనిక చర్య ఒక్కటే పరిష్కారం అని భావించారు. పటేల్ వ్యూహాత్మకంగా వ్యవహరించి నిజాం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. చర్చల ద్వారా సమస్య పరిష్కారం కాదని ఆయన గ్రహించారు. సెప్టెంబర్ 13, 1948న మేజర్ జనరల్ జె.ఎన్. చౌదరి నేతృత్వంలో భారత సైన్యం ఆపరేషన్ పోలోను ప్రారంభించింది. ఈ ఆపరేషన్ కేవలం ఐదు రోజుల్లోనే ముగిసింది. నిజాం తన ఓటమిని అంగీకరించారు. పటేల్ ముందుచూపు, ధైర్యసాహసాలు భారతదేశ ఏకీకరణలో ఒక చారిత్రక ఘట్టంగా నిలిచిపోయాయి.
రజాకార్ల హింస
హైదరాబాద్ రాజు మీర్ ఉస్మాన్ అలీఖాన్ భారత యూనియన్లో కలవనంటూ మొండికేసి హైదరాబాద్ ప్రత్యేక దేశంగా ప్రకటించుకున్న చర్యలకు తోడు రజాకార్ల హింస, హైదరాబాదుపై పోలీసు చర్యకు కేంద్ర ప్రభుత్వం నడుం కట్టింది. నాటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్పటేల్ సైన్యాన్ని రంగంలోకి దింపి ‘ఆపరేషన్ పోలో’ నిర్వహించడంతో 1948 సెప్టెంబర్ 13న హైదరాబాదుపై పోలీసు చర్య మొదలైంది. దీనికి ఆపరేషన్ పోలో అని పేరు పెట్టారు. గోడ్డాన్ ప్లాన్ అని కూడా అంటారు. మేజర్ జనరల్ జె.ఎన్. చౌదరి నాయకత్వంలో భారత సైన్యం మూడు వైపుల నుంచి హైదరాబాదును ముట్టడించింది. 1948 సెప్టెంబర్ 18న నిజాం లొంగిపోయాడు. పోలీసు చర్య ఐదు రోజుల్లో ముగిసింది. 1,373 మంది రజాకార్లు హతమయ్యారు. మరో 1911 మంది బందీలుగా పట్టుబడ్డారు. హైదరాబాదు సైన్యంలో 807 మంది చనిపోగా, 1,647 మంది పట్టుబడ్డారు. భారత సైన్యం 10 మంది సైనికులను కోల్పోయింది.
పోరాట ఫలితం
ఆపరేషన్ పోలో విజయంతో హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైంది. నిజాం పాలన ముగిసి, తెలంగాణ ప్రజలు స్వేచ్ఛ లభించింది. ఈ చర్య భారతదేశ చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఇది భారతదేశంలో అన్ని రాష్ట్రాలను కలిపి ఒక బలమైన దేశాన్ని నిర్మించడానికి దోహదపడింది. ఇదంతా సర్దార్ పటేల్ దూరదృష్టి, ధైర్యానికి నిదర్శనమనే చెప్పాలి.
