Let's talk: editor@tmv.in
నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు

నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు

Gaddamidi Naveen
17 మార్చి, 2026

తెలంగాణకు చెందిన ప్రముఖ కవి, రచయిత డాక్టర్ నందిని సిధారెడ్డికు ప్రతిష్ఠాత్మకమైన సాహిత్య అకాడమీ 2025 పురస్కారం లభించింది. ఆయన రచించిన అనిమేష కవితా సంపుటికి గాను ఈ అవార్డు ప్రకటించారు. తెలంగాణ సాహిత్య రంగంలో విశిష్టమైన కృషి చేసిన నందిని సిధారెడ్డి, తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి ఛైర్మన్‌గా కూడా సేవలందించారు.

ఈ సందర్భంగా సీఎం ఎ. రేవంత్ రెడ్డి ఆయనకు అభినందనలు తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, భాషా వైభవాన్ని తన కవిత్వం ద్వారా దేశవ్యాప్తంగా పరిచయం చేసిన కవిగా నందిని సిధారెడ్డి నిలిచారని సీఎం పేర్కొన్నారు. “అనిమేష” కవితా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం తెలంగాణకు గర్వకారణమని ఆయన అన్నారు. తెలంగాణ సాహిత్యాన్ని జాతీయ స్థాయిలో గుర్తింపుకు తీసుకెళ్లిన ఈ అవార్డు రాష్ట్ర సాహిత్య ప్రపంచానికి మరింత ప్రోత్సాహాన్నిచ్చే ఘట్టంగా భావిస్తున్నారు.