Let's talk: editor@tmv.in
ధనము విలువ తెలుసుకొనుట మానవధర్మం

ధనము విలువ తెలుసుకొనుట మానవధర్మం

FL - BHAVN
8 అక్టోబర్, 2025

‘ఉన్ననాడు తెలివి కలిగి పొదుపు చేయరా... లేనినాడు ఒడలు వంచి కూడబెట్టరా ..... ధనమేరా అన్నిటికీ మూలం…’ అని ఎప్పుడూ పెద్దలు చెబుతూనే ఉన్నారు. అయితే ప్రస్తుతం పొదుపు, మదుపు కూడా జూదంగా పరిణమించాయి. అనేకానేక ఆర్థిక నేరాలు జరుగుతున్నాయి. ఏది ఏమైనా నష్టపోతున్నది మాత్రం సామాన్యుడే. వీటన్నిటికీ పరిష్కారంగా సురక్షితంగా పొదుపు చేసుకునే మార్గం భారతీయ పొస్టల్ పొదుపు, భీమా పథకాలు అందిస్తున్నాయి.

భారతీయ పోస్టల్ సర్వీసులు కేవలం ఉత్తరాలు, పార్సిళ్లను చేరవేయడం మాత్రమే కాదు ప్రజల్లో పొదుపు అలవాటును పెంపొందిచేందుకు, ఆర్థిక భద్రతను0 కల్పించేందుకు, భీమా పథకాలు, అనేక పొదుపు పథకాలను అందిస్తోంది. పోస్టాఫీసు మదుపు పథకాలన్నీ కూడా అత్యంత సురక్షితమైనవి. ఇది ప్రభుత్వరంగ సంస్థ కనుక మారుమూల ప్రాంతాల ప్రజలకు కూడా పోస్టాఫీసు సేవలు అందుబాటులో ఉన్నాయి.

పొదుపు పథకాలెన్నో...

పోస్టాఫిస్ లో మదుపు పథకాలు చాలా అందుబాటులో ఉన్నాయి. ఇందులో కొన్ని దీర్ఘకాలిక పెట్టుబడి, పన్ను మినాహాయింపు వంటి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. వీటితో పాటు స్థిరమైన రాబడి కావాలనుకునే వారికి అనుకూలమైన పథకాలు కూడా అందుబాటులో ఉన్నాయి.

పోస్ట్ ఆపీస్ సేవింగ్స్ అకౌంట్

ఇదొక సాధారణ సేవింగ్స్ ఖాతా అని చెప్పవచ్చు. సంవత్సరానికి 4 శాతం వడ్డీ వస్తుంది. సంవత్సరానికి 10 వేల వకు వచ్చే వడ్డీకి పన్ను మినాహాయింపు ఉంటుంది.

పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్

పెట్టుబడి పై నెలవారీ స్థిర ఆధాయాన్ని పొందాలనుకునే వారికి ఇది పదవీ విరమణ చేసిన వారికి చాలా ఉపయోగకమైన స్కీమ్. దీని మెచ్యూరిటీ సమయం 5 సంవత్సరాలు

సీనియర్ సిటిజెన్స్ సేవింగ్స్ స్కీమ్

60 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న సీనియర్ సిటిజన్లకు క్రమం తప్పకుండా ఆదాయం, ఆర్థిక భద్రత కల్పించడం ఈ పథకం లక్ష్యం. వడ్డీ ఎక్కువగా వస్తుంది. వడ్డీ చెల్లింపులు త్రైమాసికానికి ఉంటాయి. సెక్షన్ 80సి కింద డిపాజిట్ కు పన్ను మినాహాయింపు ఉంటుంది.

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్

ఇదొక దీర్ఘకాలిక పెట్టుబడి. ఇదొక రిటైర్మెంట్ ప్లాన్. మెచ్యూరిటీ అవది

15 సంవత్సరాలు. అంతకు మించి పొడిగించుకొనే అవకాశం కూడా ఉంటుంది. పన్ను రహిత పథకం ఇది. అంటే డిపాజిట్, వడ్డీ, మెచ్యూరిటీ మొత్తం దేని మీద కూడా పన్ను ఉండదు. సెక్షన్ 80సి కింద డిపాజిట్ కు మినహాయింపు ఉంటుంది.

సుకన్య సమృద్ధీ యోజన

ఇది బాలికల భవిష్యత్తు కోసం పొదుపు చెయ్యడాన్ని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన పథకం. చిన్న పొదుపు పథకాలలో ఇది అధిక రాబడి ఇచ్చే పథకాల్లో ఒకటి. పీపీఎప్ లాగానే పన్ను ప్రయోజనాలు ఉంటాయి.

కిసాన్ వికాస పత్ర

నిర్దుష్ట కాల వ్యవధిలో పెట్టుబడి రెట్టింపు అవుతుంది. మెచ్యూరిటీ కాలాన్ని బట్టి వడ్డీరేటు మారుతుంది. సుమారుగా 115 నెలల వరకు ఉంటుంది.

జాతీయ పొదుపు **ధ్రు**వ పత్రాలు (నేషనల్ సేవింగ్స్ సర్టీఫికెట్స్)

ఈ పథకం ద్వారా స్థిరమైన ఆదాయం, పన్ను మినాహాయింపు ఉంటాయి. 5 సంవత్సరాలు దీని మెచ్యూరిటీ కాలం. సెక్షన్ 80సి కింద పన్ను మినహాయింపు వర్తిస్తుంది.

భారతీయ పోస్టల్ భీమా పథకాలు (ఇండియన్ పోస్ట్ ఇన్సూరెన్స్ స్కీమ్స్):

భారతీయ తపాలా శాఖ రెండు ప్రధాన భీమా పథకాలను అందిస్తుంది.

పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్

రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్

పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్

మన దేశంలో తొలి బీమా పథకాలలో ఇది ఒకటి. ఇది ప్రధానంగా ప్రభుత్వ, సెమీ-గవర్నమెంట్ ఉద్యోగులు, రక్షణ దళాలు మరియు వృత్తి నిపుణుల కోసం ప్రారంభించారు.

ప్రధాన పథకాలు:

హోల్ లైఫ్ అస్యూరెన్స్

జీవితాంతం బీమా కవరేజ్. పాలసీదారు 80 సంవత్సరాల వయస్సును చేరుకున్న తర్వాత లేదా మరణించిన తర్వాత (ఏది ముందు అయితే అది) బీమా మొత్తం మరియు బోనస్ తో కలిపి చెల్లిస్తారు.

ఎండోమెంట్ అస్యూరెన్స్

మెచ్యూరిటీ (ముందుగా నిర్ణయించిన వయస్సు) లేదా పాలసీదారు మరణం (ఏది ముందు అయితే అది)పై బీమా మొత్తం తో పాటు బోనస్ చెల్లిస్తారు.

కన్వర్టిబుల్ హోల్ లైఫ్ అస్యూరెన్స్

ఇది హోల్ లైఫ్ అస్యూరెన్స్ లాంటిది, కానీ పాలసీ తీసుకున్న 5 సంవత్సరాల తర్వాత దానిని ఎండోమెంట్ అస్యూరెన్స్‌గా మార్చుకునే అవకాశం ఉంటుంది.

యాంటిసిపేటెడ్ ఎండోమెంట్ అస్యూరెన్స్

ఇది మనీ-బ్యాక్ పాలసీ. మెచ్యూరిటీ కంటే ముందుగానే నిర్ణీత వ్యవధిలో (ఉదా.15 లేదా 20 సంవత్సరాల పాలసీకి ఒక నిర్ణీత వ్యవధిలో) కొంత భాగాన్ని తిరిగి చెల్లిస్తారు.

బాల్ జీవన్ బీమా

ఇది ప్రధాన పాలసీదారు పిల్లల కోసం తీసుకునే ప్రత్యేక పాలసీ (గరిష్టంగా ఇద్దరు పిల్లలకు). పాలసీదారు మరణిస్తే, పిల్లల పాలసీ ప్రీమియం చెల్లింపు మినహాయింపు ఉంటుంది.

ఇతర ప్రైవేటు భీమా పథకాలతో పోలిస్తే ప్రీమియం తక్కువగా ఉంటుంది. బోనస్ ఎక్కువుంటుంది. కొంత కాలం తర్వాత పాలసీ మీద రుణ సదుపాయం కూడా ఉంటుంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్80సి కింద ప్రీమియం చెల్లింపు మీద మినహాయింపు లభిస్తుంది.

రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్

గ్రామీణ ప్రాంత ప్రజల కోసం ప్రత్యేకంగా ప్రవేశపెట్టారు. గ్రామీణ ప్రాంతాల్లోని బలహీన వర్గాలు, మహిళా కార్మికులు ఇతర సాధారణ ప్రజలకు భీమా కవరేజ్ అందించడం దీని ప్రధాన లక్ష్యం.

ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి భీమాయోజన, సురక్ష భీమా యోజన

ఈ రెండూ కూడా ప్రభుత్వ సామాజిక భద్రత పథకాలను పోస్టాఫీసులు కూడా అందిస్తాయి. తక్కువ ప్రీమియంతో సంవత్సరానికి పునద్దరించదగిన జీవిత భీమా కవరేజ్ ఉంటుంది. భీమా మొత్తం 2 లక్షలుగా ఉంటుంది.

భారతీయ పోస్టల్ శాఖ అందించే పొదుపు, భీమా పథకాలు మన దేశ అభివృద్ధిలో కీలకమైన పాత్ర పోషిస్తాయి. వీటి ద్వారా ఖాతాదారులకు సురక్షితమైన రాబడి, పన్ను మినహాయింపు, విశ్వసనీయత కారణంగా కోట్లాది మంది భారతీయులు పోస్టల్ మదుపును ఎంచుకుంటూ ఉంటారు. అయితే పెద్దగా ప్రచారం లేకపోవడం వల్ల చాలా మందికి వీటికి సంబంధించిన అవగాహన ఉండదు. ఏది ఏమైనా పెట్టుబడి పెట్టడానికైనా లేదా భీమా పాలసీ తీసుకునేందుకైనా తప్పనిసరిగా ముందు పూర్తి వివరాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం.

ధనము విలువ తెలుసుకొనుట మానవధర్మం - Tholi Paluku