Let's talk: editor@tmv.in
దేశంలో ఆధ్యాత్మిక వేత్తలో నారాయణ గురు ఒకరు: ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము

దేశంలో ఆధ్యాత్మిక వేత్తలో నారాయణ గురు ఒకరు: ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము

Pinjari Chand
24 అక్టోబర్, 2025

కేరళలోని వర్కలలో ఉన్న శివగిరి మఠంలో శ్రీ నారాయణ గురువు మహాసమాధి శతాబ్దోత్సవాన్ని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం ప్రారంభించారు. సోషల్ మీడియా రాష్ట్రపతి భవన్ ‘ఎక్స్’ ఖాతాలో పోస్టు చేస్తూ శ్రీ నారాయణ గురు భారతదేశంలోని మహా ఆధ్యాత్మిక గురువుల్లో, సామాజిక సంస్కర్తల్లో ఒకరని గుర్తు చేశారు. ఆయన సమానత్వం, ఐక్యత, మానవత, ప్రేమ వంటి విలువల పట్ల ప్రజల్లో విశ్వాసాన్ని నింపారని అని పేర్కొన్నారు. శ్రీ నారాయణ గురు అన్ని జీవాలలో ఒకే ఆత్మ ఉన్నదని విశ్వసించేవారు. ఆయన మానవాళికి ‘ఒకే కులం, ఒకే మతం, ఒకే దేవుడు’ అనే శక్తివంతమైన సందేశాన్ని నేతృత్వం వహించారు. కుల, మత బేధాలు లేకుండా అందరూ సమానులే అని చెప్పారు. అద్వైత వేదాంత సిద్ధాంతాన్ని ప్రజలు అందరూ సమానమనే భావనతో ప్రచారం చేశారు. ఆధ్యాత్మికత, విద్య, సత్యం, మానవతా విలువల ద్వారా సమాజాన్ని మేల్కొల్పాలని ఆయన ప్రయత్నించారని వివరించారు. ఈ సందర్భంగా చిన్నారులు రాష్ట్రపతికి పూలు ఇచ్చి స్వాగతం పలికారు.

శ్రీ నారాయణ గురువు (1856 ఆగస్టు 20 – 1928 సెప్టెంబర్ 20) కేరళకు చెందిన తత్వవేత్త, ఆధ్యాత్మిక గురువు, సామాజిక సంస్కర్త, తత్వవేత్త, ఆయన విద్య, పరిశుభ్రత, భగవంతుడి పై భక్తి, వ్యవసాయం, పరిశ్రమలను ప్రోత్సహించారు. విద్య, కృషి, నైపుణ్యం, శుభ్రమైన జీవన వాతావరణం ద్వారా స్వయంగా బలమైన, ఆత్మగౌరవం కలిగిన సమాజాన్ని నిర్మించవచ్చని ఆయన నమ్మకం.

రాష్ట్రపతి ముర్ము మాజీ రాష్ట్రపతి కె.ఆర్. నారాయణన్ విగ్రహాన్ని కేరళ రాజ్‌భవన్‌లో ఆవిష్కరించి పుష్పాంజలి ఘటించారు. ఈ సభలో ఆమె ప్రసంగిస్తూ రాష్ట్రపతి, కె.ఆర్. నారాయణన్ నిష్కళంకత, ధార్మికత, దయ, ప్రజాస్వామిక విలువల వారసత్వాన్ని కొనియాడారు.మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మార్గదర్శకత్వంలో ఈ విగ్రహావిష్కరణ చేపట్టడం పట్ల సంతోషంగా ఉంది. కె.ఆర్. నారాయణన్ జ్ఞాపకం సమానత్వం, నిష్పక్షపాతత, ప్రజాసేవ విలువలను కొనసాగించడానికి ప్రజలకు ప్రేరణగా నిలుస్తుందని ఆమె అన్నారు. నారాయణన్ జీవితం ధైర్యం, పట్టుదల, విద్యా శక్తికి ప్రతీక. ఆయన విద్య, అంకితభావం ద్వారా దేశంలో అత్యున్నత పదవిని అలంకరించారు. విదేశాంగ సేవలో ఆయన సేవలు శాంతి, న్యాయం, సహకార విలువలను ప్రతిబింబించాయి. అనంతరం రాజకీయ రంగంలోకి వచ్చి పార్లమెంటు సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా, రాష్ట్రపతిగా ప్రజలకు న్యాయం, సమానత్వం అందించడానికి కృషి చేశారని రాష్ట్రపతి ముర్ము తెలిపారు.

దేశంలో ఆధ్యాత్మిక వేత్తలో నారాయణ గురు ఒకరు: ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము - Tholi Paluku