Let's talk: editor@tmv.in
దూరదర్శన్ మాజీ న్యూస్ రీడర్ సర్లా మహేశ్వరి కన్నుమూత

దూరదర్శన్ మాజీ న్యూస్ రీడర్ సర్లా మహేశ్వరి కన్నుమూత

Pinjari Chand
13 ఫిబ్రవరి, 2026

1980, 1990లలో టెలివిజన్ వార్త ప్రపంచంలో ప్రముఖ ముఖచిత్రంగా నిలిచిన దూరదర్శన్ మాజీ న్యూస్ రీడర్ సర్లా మహేశ్వరి గురువారం ఢిల్లీలో కన్నుమూశారు. ఆమె వయస్సు 71 సంవత్సరాలు. ఈ విషయాన్ని ఆమె కుటుంబ మిత్రుడు, సహ యాంకర్ షమ్మీ నారంగ్ వెల్లడించారు. 1976 నుంచి 2005 వరకు, దాదాపు మూడు దశాబ్దాలకు పైగా దూరదర్శన్‌లో న్యూస్ రీడర్ గా పనిచేసిన మహేశ్వరి, భారతీయ టీవీ వార్తల ప్రారంభ దశలోనే కీలక పాత్ర పోషించారు. ఆ సమయంలో ప్రసారాలు రోజుకు కొద్ది గంటలకే పరిమితమయ్యేవి. షమ్మీ నారంగ్ సామాజిక మాధ్యమాల ద్వారా సంతాపం వ్యక్తం చేస్తూ న్యూస్ రీడర్ సర్లా మహేశ్వరి మరణవార్తను తీవ్ర దుఃఖంతో తెలియజేస్తున్నాను. ఆమె శైలి, వినయం, భాషపై పట్టు, విజ్ఞానం అపూర్వం. దూరదర్శన్ తెరపై ఆమెకు ప్రత్యేక ఔరా(ప్రభావం) ఉండేదని పేర్కొన్నారు.

మహేశ్వరి ఢిల్లీ విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ పూర్తి చేసిన తర్వాత దూరదర్శన్‌లో చేరినట్లు సమాచారం. మూడు దశాబ్దాల సేవాకాలంలో బ్లాక్-వైట్ ప్రసారాల నుంచి కలర్ టెలివిజన్‌కు మార్పు చెందిన ఆమె ప్రత్యక్షంగా చూశారు. దూరదర్శన్ నేషనల్ కూడా ఎక్స్‌లో నివాళి అర్పిస్తూ, సర్లా మహేశ్వరి మృదువైన స్వరం, స్పష్టమైన ఉచ్చారణ, గంభీరమైన ఉచ్చారణ శైలి ప్రేక్షకుల హృదయాల్లో విశ్వాసాన్ని నింపాయని పేర్కొంది. ఆమె అంత్యక్రియలు సాయంత్రం 4 గంటలకు నిగమ్ బోధ్ ఘాట్‌లో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సర్లా మహేశ్వరి మృతిపై సోషల్ మీడియాలో నెటిజన్లు నివాళి అర్పించారు.