Let's talk: editor@tmv.in
దుర్గాపూర్ అత్యాచార​ ఘటన బాధాకరం: ఎంపీ డింపుల్ యాదవ్

దుర్గాపూర్ అత్యాచార​ ఘటన బాధాకరం: ఎంపీ డింపుల్ యాదవ్

Pinjari Chand
12 అక్టోబర్, 2025

కోల్ కత్తాలో ఆర్జీకర్ వైద్యవిద్యార్థి అత్యాచారం,హత్య ఘటనను మరవకముందే బెంగాల్ రాష్ట్రంలో మరో దారుణం జరిగింది. దీనిపై ప్రముఖులు స్పందిస్తున్నారు. ఈ సందర్భంగా దుర్గాపూర్ లో వైద్యవిద్యార్థినిపై జరిగిన అత్యాచార ఘటనపై సమాజ్ వాదీ ఎంపీ డింపుల్ యాదవ్ స్పందిచారు. ఇటువంటి ఘటనలు జరగడం చాలా బాధాకరం. ఈ ఘటన దేశంలో మహిళలపై పెరగుతున్న నేరాలను సూచిస్తుందన్నారు. శనివారం పశ్చిమబెంగాల్ లోని దుర్గాపూర్ లోని ఓ ప్రైవేట్ వైద్య కళాశాల ప్రాంగణంలో జరిగిన అత్యాచార ఘటనను ఆమె ఖండించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ సంఘటన బెంగాల్ కే పరిమితం కాదు. దేశవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు పెరిగిపోతున్నాయని విచారం వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్ లో కూడా అత్యాచార ఘటనలు గడిచిన పదేళ్లలో రెండింతలయ్యాయని ఆమె తెలిపారు. యూపీ ప్రభుత్వం కూడా మహిళలకు భద్రత కల్పించే విషయంలో విఫలమైందని విమర్శించారు. గతంలో సమాజ్ వాదీ పార్టీ అధికారంలో ఉండగా మహిళల సహాయం కొరకు ఏర్పాటు చేసిన 1090 హెల్ప్​ లైన్ కేంద్రాలను ప్రస్తుత యోగి ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. సమాజానికి మార్గనిర్ధేశం చేయడంలో ప్రభుత్వం విఫలమవుతుందని ఎంపీ డింపుల్ యాదవ్ ఆరోపించారు. మహిళల భద్రత విషయంలో ప్రభుత్వం కఠినచర్యలు తీసుకోకపోగా, మహిళల సహాయ కేంద్రాలను నిర్వీర్యం చేస్తుందన్నారు.

పోలీసుల వివరాల ప్రకారం

బాధితురాలు ఒడిశాలోని జలేశ్వర్ నుంచి వచ్చి బెంగాల్ లోని ఓ ప్రైవేటు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ రెండో సంవత్సరం చదువుతున్న 23 ఏళ్ల వైద్య విద్యార్థినిపై శుక్రవారం రాత్రి అత్యాచారం జరిగింది. ఈ ఘటనలో ఆమె స్నేహితులు కూడా ఉన్నట్లు తెలిపారు. ఆమె తన స్నేహితురాలితో కలిసి బయటకు వెళ్లింది. అయితే వారు ఓ నిర్జన ప్రదేశానికి వెళ్లారు. అక్కడే ఉన్న నిందితుడు వైద్యవిద్యార్థినిపై అత్యాచారం చేశారు. ఈ ఘటన సమాచారం అందుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు. అలాగే ఆమె మొబైల్, రూ.5 వేలు కూడా లాక్కున్నారని తల్లిదండ్రులు ఆరోపించారు. బాధితురాలికి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

టీఎంసీపై బీజేపీ విమర్శలు

కొల్ కత్తా అత్యాచార నిందితులకు సురక్షితమైన ప్రదేశంగా మారిందని, ప్రభుత్వ అసమర్థ భద్రతా చర్యలవల్లే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని విమర్శించారు. లా అండ్ ఆర్డర్ విషయంలో మమతా బెనర్జీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. అయితే ఈ సందర్భంగా సీఎం మమతా మాట్లాడుతూ ఇటువంటి సంఘటనలప్పుడు సంయమనం పాటించాలని, దయచేసి రాజకీయం చేయవద్దని ప్రతిపక్షాలను కోరారు.

ఖండించిన ఒడిశా ముఖ్యమంత్రి

ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాజి కూడా ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. దుర్గాపూర్‌లోని ఒడిశా విద్యార్థిని పై జరిగిన దుర్ఘటన అత్యంత బాధాకరమైనది. బాధితురాలి కుటుంబానికి అన్ని రకాల సహాయం అందిస్తాం. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి అవసరమైన సహాయం ఒడిశా ప్రభుత్వం తరఫున చేస్తామని ఎక్స్ లో తెలిపారు.

విద్యార్థి సంఘాల ఆందోళన

ఐక్యూ సిటీ మెడికల్ కాలేజీ సమీపంలో అక్టోబర్ 10న జరగిన అత్యాచారానికి సంబంధించి విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేశాయి. కాలేజీ యాజమాన్యం ఈ సంఘటన విషయంలో నిర్లక్ష్యం వహిస్తుందని సంఘాలు ఆరోపించాయి. పారదర్శక విచారణ జరగాలని, బాధితురాలకి న్యాయం చేయాలని, అలాగే కాలేజీ క్యాంపస్ లో భద్రతా పరమైన ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశాయి. కాలేజీ డీన్ కి ఈ విషయమై ఒక మెమోరండం ఇచ్చాయి.

దుర్గాపూర్ అత్యాచార​ ఘటన బాధాకరం: ఎంపీ డింపుల్ యాదవ్ - Tholi Paluku