Let's talk: editor@tmv.in
దుర్గాపూజ ఉత్సవాలు ప్రారంభం

దుర్గాపూజ ఉత్సవాలు ప్రారంభం

Pinjari Chand
29 సెప్టెంబర్, 2025

మహిషాసురుడిపై దుర్గాదేవీ సాధించిన విజయానికి గుర్తుగానే దుర్గాపూజ నిర్వహిస్తారని, ఆ దేవత ఈ సందర్భంలో భూమిపైకి తన భక్తులను ఆశీర్వదించడానికి వస్తుందని, ఈ సందర్బంగా పెద్ద ఎత్తున, అత్యంత భక్తి శ్రద్ధలతో దుర్గాపూజను నిర్వహిస్తారని పశ్చిమబెంగాల్​ లోహపట్టి చల్తాబోగన్​ దుర్గాపూజ కమిటీ చైర్మన్​ సందీప్​ భూటోరియా ఈ పండుగ ప్రాముఖ్యతను వివరించారు. ప్రస్తుతం నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయని ఈ ఉత్సవాలకు దేశ, విదేశాల నుంచి ఎంతో మంది రాయబారులు, పర్యాటకులు దర్శించడానికి వస్తారని తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద పూజ ఉత్సవమన్నారు. అలాగే ఉత్సవాన్ని ప్రపంచ వారసత్వ సంస్థ ‘యూనెస్కో’ కూడా గుర్తించిందని తెలిపారు. ఈ ఉత్సవాలు ప్రారంభం కాగానే వేలాది మంది భక్తులు, సందర్శకులు తమ కుటుంబ సభ్యులు, స్నేహితులతో పాటు ఇక్కడికి వస్తారని, నగరంలోని దుర్గాదేవిపూజ మండపాలను దర్శించుకుంటారని తెలిపారు.

ఆకట్టుకుంటున్నకళాత్మక ప్రదర్శనలు

పండుగ సందర్భంగా దుర్గాదేవీ మండపాలు(పండల్​) దర్శంచుకోవడానికి వచ్చే వారి కోసం నిర్వహాకులు పండల్​ గోడలను పవిత్ర శ్లోకాలు, మంత్రాలతో అలంకరించారు. అలాగే ఆధ్యాత్మిక చిత్రాలతో అలంకరించారు. త్రిధార అలోక్​ బంధన్​ థీమ్​ తో ‘చోలో ఫిరి’ అనే ఇతివృత్తాల ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఇది ప్రాచీన కాలంలో గుహాల్లో ఆదిమానవులు ఏ విధంగా శివుడు, విష్ణువు, కాళి దేవతలను ఆరాధించారు అనే కళా రూపాలను ప్రదర్శిస్తున్నారు. దీంతో పండల్ లో ఆధ్యాత్మక శోభ సంతరించుకుంది.

దుర్గాపూజ ఉత్సవాలు ప్రారంభం - Tholi Paluku