
‘దీపు చంద్రదాస్’ నిందితులను శిక్షించాలి: అసదుద్దీన్
బంగ్లాదేశ్‌లో హిందూ వ్యక్తి దీపు చంద్ర దాస్‌ను కొట్టి చంపడాన్ని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ సోమవారం ఖండించారు. తాత్కాలిక ప్రభుత్వ అధిపతి ముహమ్మద్ యూనస్ నిందితులపై చర్యలు తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఘటన బంగ్లాదేశ్ రాజ్యాంగానికి పూర్తిగా విరుద్ధమని పేర్కొంటూ, ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వాధినేత ముహమ్మద్ యూనస్ నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. సోమవారం మీడియాతో ఓవైసీ మాట్లాడారు. దీపు చంద్ర దాస్‌కు జరిగింది రాజ్యాంగ ఆత్మకు వ్యతిరేకం. ఎలాంటి మూక దాడి అయినా మా పార్టీ ఖండిస్తుంది. యూనస్, ఆయన ప్రభుత్వం ఈ తరహా ఘటనలపై కఠినంగా స్పందించాలని అన్నారు.
విదేశీ శక్తుల పాత్రపై వ్యాఖ్యలు
బంగ్లాదేశ్‌లో పాకిస్తాన్ ఐఎస్ఐ తో పాటు భారతదేశానికి వ్యతిరేకంగా ఉన్న చైనా శక్తులు కూడా చురుకుగా ఉన్నాయని ఓవైసీ వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితుల్లో బంగ్లాదేశ్‌తో భారత్ సంబంధాలను బలోపేతం చేయడం చాలా అవసరం అని చెప్పారు. ఈ విషయంలో విదేశాంగ మంత్రి తీసుకుంటున్న చర్యలకు తమ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని తెలిపారు.
మూకదాడి– చట్ట పాలనకు ముప్పు
భారత్‌లోనైనా, బంగ్లాదేశ్‌లోనైనా మూకదాడి జరిగితే అది చట్ట పాలన విఫలమవుతోందని సూచన అని అన్నారు. బంగ్లాదేశ్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 41 – మత స్వేచ్ఛ,
ఆర్టికల్ 12 సెక్యులరిజం వీటిని గుర్తు చేస్తూ, ఈ ఘటన ఆ నిబంధనలకు విరుద్ధమని చెప్పారు.
భారత్‌లో జరిగిన ఘటనలపై కూడా ఆందోళన
ఓడిశా సంబల్పూర్‌లో పశ్చిమ బెంగాల్‌కు చెందిన కార్మికుడు జోయెల్ షేక్, అలాగే డెహ్రాడూన్‌లో విదేశీయుడని పొరబడి హత్యకు గురైన ఏంజెల్ చక్మా ఘటనలను ప్రస్తావించిన ఓవైసీ, కొంతమంది చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని మతం లేదా రూపురేఖల ఆధారంగా హత్యలు చేస్తున్నారు. ఇది అత్యంత సిగ్గుచేటు విషయమని విమర్శించారు. దేశీయతపై అనుమానం ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలి, కానీ హత్యలు చేయడానికి ఎవరికీ హక్కు లేదని స్పష్టం చేశారు. ఇలాంటి దారుణ ఘటనలకు బీజేపీ , ఆర్ఎస్ఎస్ నుంచి మద్దతు ఉండదని ఆశిస్తున్నానని ఓవైసీ వ్యాఖ్యానించారు.
