Let's talk: editor@tmv.in
దసరా ఉత్సవాలకు పవన్ కళ్యాణ్‌కు ఆహ్వానం

దసరా ఉత్సవాలకు పవన్ కళ్యాణ్‌కు ఆహ్వానం

FL - SUNL
20 సెప్టెంబర్, 2025

నగరంలోని ఇంద్రకీలాద్రిపై సెప్టెంబర్ 22 నుంచి జరిగే కనకదుర్గమ్మ అమ్మవారి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు హాజరు కావాలని కోరుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను ఆలయ ఈవో వి.కె. శీనానాయక్ ఆహ్వానించారు. శుక్రవారం శాసనసభ విరామ సమయంలో పవన్ కళ్యాణ్‌ను కలిసి ఆహ్వాన పత్రికతో పాటు అమ్మవారి ప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పవన్ కళ్యాణ్‌కు వేద ఆశీర్వచనాలు అందజేశారు.

దసరా ఉత్సవాలకు పవన్ కళ్యాణ్‌కు ఆహ్వానం - Tholi Paluku