Let's talk: editor@tmv.in
దోమలు వీరినే ఎక్కువ కుడతాయి

దోమలు వీరినే ఎక్కువ కుడతాయి

FL - BHAVN
22 సెప్టెంబర్, 2025

ఒక గుంపు వ్యక్తులు ఒకేచోట ఉన్నప్పుడు కొంత మంది దోమలు బాగా కుడుతున్నాయని కంప్లైంట్ చేస్తుంటారు. వారి చుట్టే దోమలు తిరుగుతూ ఉంటాయి. మిగతా వారంతా కూడా పెద్దగా ఇబ్బంది పడుతున్నట్టు అనిపించదు. ఇలా ఎందుకు జరుగుతుంది?

దోమలు కొంత మందిని మాత్రమే ఎక్కువగా కుడతాయా? ఎందుకు వీరు మాత్రమే దోమలను ఆకర్శిస్తారు? అని అనుమానం కలుగుతూ ఉంటుంది చాలా సార్లు. ఇలాంటి అనుమానమే అమెరికాకు చెందిన కొంతమంది అధ్యయనకారులకు కలిగింది. ఈ అనుమానాన్ని నివృత్తి చేసుకునేందుకు గాను ఈ నిపుణుల బృందం కొత్త పరిశోధన చేపట్టారు.

అమెరికాకు చెందిన కెమికల్ సొసైటి వారి రియాక్షన్ బృందం తమ అధ్యయనం తర్వాత దోమలు ఎందుకు కొంత మందినే కుడుతాయనే విషయం గురించి అధ్యయనం చేసి కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడి చేశారు. మనలో కొందరి చర్మం నుంచి వెలువడే రసాయనాల వల్ల ఇతరుల కంటే దోమలను ఎక్కువగా ఆకర్షిస్తాయి. అయితే ఆ రసాయనాలు ఏమిటి? అసలు వాటిని ఎలా గుర్తించారు? ఈ సమస్యను ఎలా అధిగమించాలి? వంటి వివరాలు ఈ అధ్యయన ఫలితాల్లో తెలిపారు.

శరీరంలోని వేడి వల్ల మన శరీరంలోని రసాయనాలు ఉద్దీపనం అవుతాయి. ఆ తర్వాత అవి శ్వాస నుంచి వచ్చే కార్బన్ డైయాక్సైడ్ వల్ల ఈ రసాయనాల వాసన వ్యాపిస్తుంది. దోమలు ఈ వాసన ద్వారానే వ్యక్తులను గుర్తిస్తాయి. కాలీఫోర్నియాలోని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటికి చెందిన అలెక్స్ కి తనతో పాటు ఉన్న ఎనిమిది మంది ఉన్నప్పటికీ అక్కడున్న ప్రతీ దోమ తననే కుడుతోందని అనిపించిందని చెపుతున్నారు. .

ఇది నిజమే, అలా జరగడం మనలో కూడా చాలా మందికి అనుభవంలో ఉండే ఉంటుంది. ఎందుకు జరుగుతుందో ఊహించడం మాత్రం కష్టం. చర్మపు వాసన వల్ల కొంత మంది దోమలను ఆకర్షితాయని అనుకుంటారు. ఈ విషయాన్ని నిర్ధారించేందుకు ఎన్నో అధ్యయానాలు జరిగాయి. కొన్ని అధ్యయనాలు బ్లడ్ గ్రూప్ ప్రమేయం వల్ల కూడా దోమలను ఆకర్షించవచ్చనే వాదన కూడా ఉంది.

కొంత మంది ప్రెగ్నెన్సి వల్ల కూడా దోమలు ఆకర్శించబడతాయని అంటున్నారు. తీసుకునే ఆహారాన్ని బట్టి కూడా మన శరీర వాసన మారుతుందని దాన్ని బట్టి కూడా దోమలు ఆకర్శించబడతాయని కూడా ఒక వాదన ఉంది. అయితే రకరకాల అధ్యయనాలు రకరకాల ఫలితాల విశ్లేషణలు అందించడం వల్ల ఈ విషయంలో చాలా గందరగోళం ఏర్పడిందని చెప్పాలని సెల్ జర్నల్ ఒక ఆర్టికల్ ప్రస్తావించింది.

చర్మం మీద ఉండే అమైనో యాసిడ్స్ లో ఒకటైన కార్బాలిక్ ఆసిడ్ మన సీబమ్ లో ప్రత్యేక వాసనకు కారణం అవుతుంది. సీబమ్ వల్లే చర్మం ఎల్లప్పుడు తేమగా ఉంటుంది. ఈ సారి పరిశోధకులు ఎంచుకున్న కొంత మందికి చేతుల మీద ధరించేందుకు ఫ్యాషన్ ఫార్వార్డ్ నైలాన్ మేజోళ్లు అందించారు. తర్వాత వీటిని ఈడెన్ ఈజిప్టి దోమలు ఉన్న చోట వీటిని పెట్టారు. కొన్ని మేజోళ్లను ఇవి బాగా ఆకర్శించాయి. ఇందుకు చర్మం నుంచి నైలాన్ మేజోళ్ల మీద చేరిన రకరకాల కార్బాక్సిలిక్ ఆమ్లాలు కారణం అని పరిశోధకులు నిర్ధారణకు వచ్చారు. ముఖ్యంగా పెంటాడేకానోయిక్, హెప్టాడెకానోయిక్, నాన్ డెకానోయిక్ అనే కార్బాక్సిలిక్ ఆమ్లాలు అధిక స్థాయిలో ఉన్నవారు దోమలను ఎక్కువగా ఆకర్షిస్తున్నారట. ఈ అధ్యయనం మూడు సంవత్సరాల వ్యవధిలో జరిగినందున పాల్గొనేవారు ఎలాంటి ఆహారం తీసుకున్నారు? బీరు వంటి ఆల్కహాల్ తీసుకున్నారా అనే విషయాలను అసలు పరిగణనలోకి తీసుకునే అవసరం పడలేదు. పైన చెప్పిన ఆహార, పానీయాల వల్ల మార్పులేమీ పెద్దగా గమనించలేదట. కేవలం ఈ కారకాల ఫలితాలు స్థిరంగా ఉన్నాయనేది నిర్ధారణ అయ్యింది.

దీనితో ఏం ఉపయోగం?

దోమలు ఎక్కువగా కుట్టే వారికి ఈ అధ్యయనం ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం.ఎన్ ఎన్-డైథైల్-మెటా-టోలమైడ్ అనే రసాయన సమ్మేళనం ఉపయోగిస్తే దోమలకు వాసన కనుక్కొవడం కష్టతరం అవుతుంది. కనుక దీన్ని స్ట్రాంగ్ మస్కిటో డిటెరెంట్ గా చెప్పవచ్చు. నిమ్మకాయ, యూకలిప్టస్ నూనె వాడటం వల్ల కూడా దోమ కాటును నివారించడం సాధ్యమే. ఇప్పటి వరకు బాగా ప్రాచూర్యంలో ఉన్న సిట్రొనెల్లా క్యాండిల్స్ పెద్దగా దోమలను తరమలేకపోయాయట.

ఇక నుంచి నిమ్మకాయల వాసన, యూకలిప్టస్ నూనె వంటివి లేపనంగా వాడి దోమకాటు నుంచి కాపాడుకోవచ్చనేది ఈ అధ్యయన సారాంశం.

దోమలు వీరినే ఎక్కువ కుడతాయి - Tholi Paluku