
దబాంగ్ ఢిల్లీ.. డబుల్ ధమాకా
ఎన్నో రోజులుగా జరుగుతున్న పీకేఎల్ కబడ్డీ నిన్నటితో ముగిసింది. సీజన్ మొత్తం టాప్ రెండు జట్లుగా నిలిచిన టీమ్లు ఫైనల్స్ కి చేయారీ. ఈ ఎగ్జయిటింగ్ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారా అని ఫ్యాన్స్ అంతా ఎదురు చూశారు. ఫ్యాన్ పోల్స్‌లో అందరూ దబాంగ్ ఢిల్లీ కి సపోర్ట్‌గా ఓట్ వేశారు. అనుకునట్టు గానే ఢిల్లీ పూణే మీద మూడు పాయింట్ల లీడ్‌తో కప్పు సాధించింది.
పూణేరి పల్టన్స్ కూడా చాలా గట్టి పోటీ ఇచ్చారు అనే చెప్పాలి. ఆదిత్య షిండే సెమీ ఫైనల్స్ లో ఎలాంటి ఆట తీరు చూపించాడో, ఫైనల్స్ లో కూడా అపోనెంట్ లని వాణికించాడు. కానీ ఈరోజు ఆదిత్య షిండే ఒంటరి పోరాటం చేశారు అనే చెప్పాలి. ఎలాగ అయితే తెలుగు టైటాన్స్ డిఫెన్సులో తప్పులు చేశారో అదే విధంగా పూణే డిఫెన్సులో చాలా తప్పులు చేసింది. గౌరవ్ షిండే తప్ప అందరూ డిఫెన్సులో తప్పులు చేశారు. ఇటు ఢిల్లీలో ఆటగాళ్లు ఎవరు తొందర పడకుండా చాలా తెలివిగా ఆడారు. అస్సలు ఎలాంటి స్టార్ ప్లేయర్ లేని టీమ్‌గా వచ్చి, వాష్ అవుట్ అవుతుంది అనుకున్న అందరి నోర్లు మూయించింది.
పూణే ఫస్ట్ హాఫ్ లో ఆదిత్య షిండే, అస్లాం కలిసి ఒక మంచి లీడ్‌ని కొనసాగించారు. ఇటు ఢిల్లీలో ఆశు మాలిక్ గాయం ఇంకా పూర్తిగా తక్కగా పోవడం వలన చాలా నెమ్మదిగా ఆడాడు. డిఫెన్సులో ఎలాంటి ఎరర్‌లు లేకుండా, రైడ్ పాయింట్లు సాదిస్తూ వచ్చారు. డు ఆర్ డై రైడ్‌లలో తప్ప ఢిల్లీ ఆటగాళ్లు ఎక్కడ రిస్క్ తీసుకోలేదు. మొదటి హాఫ్ ముగిసేసరికి ఢిల్లీ 24-18 లీడ్‌తో బలంగా నిలబడ్డారు.
ఇక ఆ తర్వాత సెకండ్ హాఫ్ మొదలు అయిన వెంటనే పూణే ఆటగాళ్లు కాస్త కాన్ఫిడెన్స్ లో తగ్గారు అనే చెప్పాలి. ఇదే అరుదుగా చూసుకున్న ఢిల్లీ రైడర్స్, నీరజ్ నర్వాల్, అజింక్య పవర్, పూణే టీమ్‌ను ఆల్ అవుట్ చేసి ఏడు పాయింట్ల లీడ్‌తో ముందుకు సాగిపోయింది. ఇక అక్కడి నుంచి ఢిల్లీ తన లీడ్‌ని కిందకి పడనివ్వలేదు. ఫజల్ అత్రచెలి, సుర్జీత్ డిఫెన్సు చాలా బలంగా ఉండడంతో పూణే రైడర్లు చాలా వరకు పాయింట్లు సాదించడానికి కష్టపడ్డారు.
ఢిల్లీ మ్యాచ్ మొత్తాన్ని తన వైపు తిప్పుకోడానికి ఎక్కువ సమయం పట్టలేదు. ఇక చివరి పది నిమిషాలు మిగిలిన కూడా పూణే కోచ్ అజయ్ ఠాకూర్‌కు చేసేది ఏం లేదు అని అర్దం అయ్యింది. ఆదిత్య షిండే, పంకజ్ బెంచ్ మీద కూర్చున్నాకా, పూణే డిఫెండర్లు మ్యాచ్ మీద కంటే కోచ్ అజయ్ ఠాకూర్‌ని సలహా కోసం చూస్తున్నారు. అజయ్ ఠాకూర్ కూడా ఎలాంటి సలహాలు ఇవ్వకుండా దీనంగా మ్యాచ్‌ని చూస్తూ ఉండిపోయాడు. ఇటు ఢిల్లీ కోచ్ జోగిందర్ నర్వాల్ మాత్రం ఢిల్లీకి డిఫెన్సులో ఎలా ఉండాలో టిప్స్ అందిస్తూనే ఉన్నాడు.
ఇక మ్యాచ్ చివరి అయిదు నిమిషాలకి వచ్చేసరికి ఢిల్లీ 27-22తో లీడ్ కొనసాగిస్తుండగా, ఆదిత్య షిండే ఒక సూపర్ రైడ్ చేసి లీడ్‌ను కాస్త తగ్గించాడు. అది చూసిన పూణే అభిమానులలో ఇంకా ఆశ మిగిలుంది. కానీ ఫజల్ తర్వాత రైడ్‌లో ఆదిత్య షిండేని టాకీల్ చేసి గేమ్‌ని మరోసారి వన్ సైడెడ్‌గా మార్చాడు. ఇక చివరి మూడు నిమిషాలకి వచ్చేసరికి ఢిల్లీ ఆటగాళ్లు టైమ్‌ను వృధా చేయడం మొదలు పెట్టారు. పూణే డిఫెన్సు చివరి క్షణాల్లో టాకీల్‌కు ప్రయత్నించిన లాభం లేకుండా పోయింది. ఆశు మాలిక్ మ్యాట్ పైకి వచ్చాక తనని తాను సబ్స్టిట్యూట్‌గా అవుట్ అయ్యి పూణే ఆటగాళ్లని ఆశాచార్య పరిచాడు. కెప్టెన్ మ్యాట్ మీద లేకపోయేసరికి ఇదే సలువు అనుకున్నారు పూణే రైడర్స్. కానీ మ్యాట్ మొత్తాన్ని డిఫెండర్స్‌తో నింపి పూణే రైడర్‌లని అవుట్ చేశారు దబాంగ్ ఢిల్లీ ఆటగాళ్లు.
ఇక చివరికి చేసేది ఏమి లేక పూణే చివరి నిమిషంలో గివ్ అప్ ఇచ్చేశారు. అలా 31-28 లీడ్‌తో ఢిల్లీ, వారి ఖాతాలో రెండో కప్పు నమోదు చేసుకుంది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నీరజ్ వర్వాల్ గెలుచుకున్నాడు. ప్లేయర్ ఆఫ్ ది సీజన్‌గా పాట్నా పైరేట్స్ కెప్టెన్ ఆయాన్ గెలుచుకున్నాడు. బెస్ట్ డిఫెండర్‌గా తెలుగు టైటాన్స్ నుండి శంకర్ గధాయి గెలుచుకున్నాడు. మొత్తానికి ఇలా దబాంగ్ ఢిల్లీ పీకేఎల్ సీజన్ పనెండులో ఛాంపియన్‌లుగా నిలిచారు.
