Let's talk: editor@tmv.in
తేలకంటిగూడెంలో సామూహిక గృహ ప్రవేశాలు

తేలకంటిగూడెంలో సామూహిక గృహ ప్రవేశాలు

Gaddamidi Naveen
28 సెప్టెంబర్, 2025

నల్గొండ జిల్లా కనగల్ మండలంలోని తేలకంటిగూడెం గ్రామంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు గృహపట్టాలు పంపిణీ చేసి, సామూహిక గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన‌డం నాకు ఆనంద‌గా ఉంద‌న్నారు. ఈ గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి, ప్రతి ఇంటికి స్థలంతో కలిపి రూ.15 లక్షల పైగా ఖ‌ర్చు చేసి ఇందిర‌మ్మ‌ ఇంటి నిర్మాణాన్ని చేపట్టామని తెలిపారు.

ఇందిరమ్మ ఇండ్ల మాదిరిగా ప్రతిఒక్కరికి న్యాయం చేయాలనే సంక‌ల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందన్నారు, పేదల కలలు నెరవేరేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పేదలకు ఇళ్లు, విద్య, వైద్యం వంటి మౌలిక అవసరాలపై ప్రత్యేక దృష్టి సారించగా, ఇప్పుడు కూడా అదే ధోరణిని కొనసాగించడం గర్వంగా ఉందని చెప్పారు. ఇలా ప్రభుత్వ సహకారంతో ఎంతో మంది ఇల్లు కలగానే చూస్తూ ఉండగా, ఇప్పుడు అదే ఇళ్లు వారికి నిజమైన ఆస్తిగా, భద్రతగా మారిందని పేర్కొన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతు తెలపాలని, ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ అభ్యర్థులను ఆశీర్వదించాలని మంత్రి కోమటిరెడ్డి ప్రజలను కోరారు. ఈ కార్యక్రమం ద్వారా కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన నిలుస్తున్నదన్న సందేశం ప్రజలకు అందిందని, తమ అండదండలతో ఎల్లప్పుడూ ప్రజలతో ఉంటామని హామీ ఇచ్చారు.

తేలకంటిగూడెంలో సామూహిక గృహ ప్రవేశాలు - Tholi Paluku