
తెలుగు విశ్వవిద్యాలయంలో 'ఎకోస్ ఆఫ్ ది పాస్ట్' జాతీయ సదస్సు
సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం, చరిత్ర, సంస్కృతి, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో "ఎకోస్ ఆఫ్ ది పాస్ట్: హిస్టరీ అండ్ హెరిటేజ్ షేపింగ్ ద సొసైటీ" అనే అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సును నిర్వహించనున్నారు. మార్చి 30, 31 తేదీల్లో హైదరాబాద్ లోని నాంపల్లి క్యాంపస్ లో ఉన్న డాక్టర్ ఎన్టీఆర్ కళామందిరంలో ఈ సదస్సు జరగనుంది.
భారతీయ, తెలంగాణ చరిత్ర, సంస్కృతి, వారసత్వ సంపదపై సమగ్ర చర్చను చేపట్టడమే ఈ సదస్సు ప్రధాన లక్ష్యం. చరిత్ర కేవలం గతం మాత్రమే కాదు, అది సమాజాన్ని ఎలా ప్రభావితం చేస్తుందనే అంశంపై దేశవ్యాప్త మేధావులు, పరిశోధకులు తమ పరిశోధనా పత్రాలను సమర్పించి చర్చించనున్నారు. చరిత్రకారులు, చరిత్ర పరిశోధకులు, విద్యార్థులు తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు.
సదస్సులో ప్రధానాంశాలు:
తెలంగాణ అధ్యయనం:
చారిత్రక వారసత్వం, కొత్త ఆవిష్కరణలు, తెలంగాణ చరిత్రను తిరగరాయడంలో ఉన్న సవాళ్లు.
వైబ్రంట్ ఇండియా:
భారతీయ చరిత్రలో భిన్నత్వం, ప్రాచీన విజ్ఞాన వ్యవస్థలు, చరిత్ర లేఖనం
పర్యాటకం, వారసత్వం:
వారసత్వ ప్రదేశాల సంరక్షణ, పర్యాటక రంగ అభివృద్ధిలో ప్రజలు,మీడియా పాత్ర.
సాంస్కృతిక సంప్రదాయాలు:
కళలు, జానపద, గిరిజన సంప్రదాయాలు, వాటి పరిరక్షణ.
ఈ సదస్సులో పాల్గొనడానికి ఆసక్తి గలవారు తమ పరిశోధనా పత్రాలను పంపాలని నిర్వాహకులు కోరుతున్నారు. తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో పత్రాలను సమర్పించవచ్చు. ఎంపిక చేసిన పత్రాలను సదస్సు ప్రొసీడింగ్స్‌లో ఐఎస్బీఎన్ నంబర్ తో ప్రచురిస్తారు. మరింత సమాచారం కోసం నిర్వాహకులను సంప్రదించవచ్చు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 100 రోజుల ప్రణాళికలో భాగంగా ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్: డా.ఏం ఏ శ్రీనివాసన్- 8106935000, సాయి అఖిల్ సాగర్ -7893085541
