Let's talk: editor@tmv.in
తెలుగు రాష్ట్రాల ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు, రేవంత్

తెలుగు రాష్ట్రాల ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు, రేవంత్

Dantu Vijaya Lakshmi Prasanna
4 మార్చి, 2026

హోలీ పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

హోలీ పండుగ చెడు పై మంచి గెలుపుకు ప్రతీకగా నిలుస్తుందని చంద్రబాబు నాయుడు ఎక్స్ లో పేర్కొన్నారు. ‘కామదహనం’తో ప్రారంభమయ్యే ఈ రంగుల పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో కొత్త ఆశలు, ఆనందం నింపాలని ఆకాంక్షించారు. బంధుమిత్రులు, సాటివారితో సంతోషాన్ని పంచుకుంటూ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆయన కోరారు.

అదే విధంగా, సీఎం రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా, ఈ హోలీ పండుగ సమాజంలో ఐక్యత, స్నేహభావం, పరస్పర గౌరవాన్ని పెంపొందించాలని, ప్రతి ఇంట్లో ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ప్రజలు సురక్షితంగా, పర్యావరణహితంగా సహజసిద్ధమైన రంగులు, సాంప్రదాయ పద్ధతులతో హోలీ వేడుకలను జరుపుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సందేశాలతో హోలీ పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది.