Let's talk: editor@tmv.in
తెలంగాణ మున్సిపాలిటీల్లో మూడో సవరణ చట్టం అమల్లోకి

తెలంగాణ మున్సిపాలిటీల్లో మూడో సవరణ చట్టం అమల్లోకి

Pinjari Chand
15 జనవరి, 2026

తెలంగాణ మున్సిపాలిటీస్ (మూడో సవరణ) చట్టం–2026ను రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఈ మేరకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ జీఓ నం.13ను జారీ చేసింది. గవర్నర్ ఆదేశాల మేరకు ఈ చట్టం జనవరి 13, 2026 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి వచ్చినట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఈ చట్టానికి తెలంగాణ గవర్నర్ జనవరి 11, 2026న ఆమోదం తెలిపారని, అదే రోజు తెలంగాణ అసాధారణ రాజపత్రంలో ప్రచురించామని ప్రభుత్వం వెల్లడించింది. అనంతరం చట్టం అమలులోకి వచ్చే తేదీని ప్రకటిస్తూ ప్రత్యేక నోటిఫికేషన్ జారీ చేసింది. మూడో సవరణ చట్టం ద్వారా తెలంగాణ మున్సిపాలిటీస్ చట్టం–2019లో మార్పులు చేపట్టారు. ఇందులో భాగంగా షెడ్యూల్–Iలోని 22– నల్గొండ కింద ఉన్న సీరియల్ నెంబర్ 86ను తొలగించారు. అదే సమయంలో షెడ్యూల్–IIలో కొత్తగా సీరియల్ నెంబర్ 16ను చేర్చి, అందులో నల్గొండ – నల్గొండ – 48గా నమోదు చేశారు. ఈ మార్పులు మున్సిపల్ పరిపాలన, పాలనా నిర్మాణం, ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అంశాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. చట్టానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలంగాణ రాజపత్రంలో పొందుపరిచినట్లు వెల్లడించారు.