Let's talk: editor@tmv.in
తెలంగాణ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన‌ అజారుద్దీన్

తెలంగాణ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన‌ అజారుద్దీన్

Gaddamidi Naveen
1 నవంబర్, 2025

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో కొత్తగా చేరిన మహమ్మద్ అజారుద్దీన్ పదవీ స్వీకార ప్రమాణ కార్యక్రమం శుక్ర‌వారం ఘనంగా జరిగింది. రాజ్‌భవన్‌ దర్బార్‌ హాలు ఈ కార్యక్రమానికి వేదికైంది.రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ,మహమ్మద్ అజారుద్దీన్నిమంత్రిగా ప్రమాణం స్వీకారం చేయించారు.రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరై అజారుద్దీన్ కి శుభాకాంక్షలు తెలియజేశారు.రాష్ట్ర అభివృద్ధిలో అజారుద్దీన కీలక పాత్ర పోషించాలని, ఆయన సేవలు రాష్ట్రానికి మరింత బలం చేకూర్చాలని సీఎం ఆకాంక్షించారు.ఈ ముఖ్యమైన కార్యక్రమంలో రాష్ట్రంలోని పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

మహమ్మద్ అజారుద్దీన్ ఫిబ్రవరి 8, 1963న హైదరాబాద్‌లో జన్మించారు. ఆయన విద్యాభ్యాసం ఆస్మానియా యూనివర్శిటీలోని న్యూ సైన్స్ కాలేజ్లో జరిగింది. చిన్నతనం నుంచే క్రికెట్‌పై ఆసక్తి కలిగి, తన ప్రతిభతో యువస్థాయిలోనే వెలుగులోకి వచ్చారు.

1980ల చివర నుంచి భారత క్రికెట్‌లో అజహరుద్దీన్ పేరు చిరస్థాయిగా నిలిచింది.తన మొదటి టెస్టు మ్యాచ్‌లోనే ఇంగ్లాండ్‌పై హ్యాట్రిక్ సెంచరీలతో ప్రపంచ దృష్టిని ఆకర్షించారు.1990లలో భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించి, ఆయన నేతృత్వంలో భారత జట్టు అనేక విజయాలు సాధించింది.అనంతరం రాజకీయాల్లో ప్రవేశించి, 2009లో జరిగిన 15వ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున లోక్‌సభ సభ్యుడిగానూ సేవలందించారు.అయితే తరువాతి ఎన్నికల్లో (2014లో) ఆయనకు విజయం సాధ్యం కాలేదు. ఇప్పుడు రాష్ట్ర మంత్రివర్గంలో భాగమవ్వడం ఆయన బహుముఖ జీవితానికి కొత్త దశను తెరలేపుతోంది.ఈ నియామకంతో, క్రీడా మైదానం నుంచి ప్రజాసేవ వైపు అడుగులు వేశారు.