
తెలంగాణ ‘దోస్త్’ నోటిఫికేషన్ విడుదల
రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలల్లో 2026-27 విద్యాసంవత్సరం ప్రవేశాల కోసం దోస్త్ నోటిఫికేషన్ విడుదలైంది. ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ బాలకృష్ణారెడ్డి ఈ ప్రకటన చేశారు. మూడు విడతల్లో జరిగే ఈ ప్రవేశాల ప్రక్రియ ఈ నెల 15 నుంచి ప్రారంభం కానుంది. ఇంటర్ ఉత్తీర్ణులైన విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. జూన్ నెలాఖరుకు కౌన్సెలింగ్ జరుగుతుంది. జులై 1 నుంచి తరగతులు ప్రారంభించనున్నట్లు అధికారులు వెల్లడించారు. పారదర్శకత కోసం విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారానే వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచించారు. బీఏ, బీఎస్సీ, బీకాం, బీబీఏ, బీసీఏ వంటి డిగ్రీ కోర్సులతో పాటు వొకేషనల్ కోర్సులు, అలాగే ఫార్మసీ డిప్లొమా కోర్సుల (పాలిటెక్నిక్స్) అడ్మిషన్లు కూడా ఈ డోస్ట్ విధానం ద్వారా నిర్వహించబడతాయి.
దోస్త్ 2026–27 ముఖ్య షెడ్యూల్ వివరాలు
• నోటిఫికేషన్ విడుదల తేదీ: 13-04-2026
• ఫేజ్-1 రిజిస్ట్రేషన్‌ప్రక్రియ : ఏప్రిల్ 15 నుంచి మే 7 వరకు
• రిజిస్ట్రేషన్ ఫీజు : రూ.200
• వెబ్ ఆప్షన్స్: ఏప్రిల్ 30 నుంచి మే 8 వరకు
• సర్టిఫికెట్ల వెరిఫికేషన్: మే 7, 8
• సీట్ల కేటాయింపు: మే 14న
• ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్: మే 15 నుంచి 23 వరకు
ఫేజ్-2
• రిజిస్ట్రేషన్: మే 15 నుంచి మే 25 వరకు
• వెబ్ ఆప్షన్స్: మే 15 నుంచి మే 26 వరకు
• మే 26న సర్టిఫికెట్ల వెరిఫికేషన్
• మే 30న సీట్ల కేటాయింపు
• ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్: మే 31 నుంచి జూన్ 5 వరకు
ఫేజ్-3
• రిజిస్ట్రేషన్: మే 31 నుంచి జూన్ 15 వరకు
• వెబ్ ఆప్షన్లు: మే 31 నుంచి జూన్ 16 వరకు
• సర్టిఫికెట్ల వెరిఫికేషన్: జూన్ 16
• సీట్ల కేటాయింపు : జూన్ 20
• ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్: జూన్ 20 నుంచి జూన్ 25 వరకు
• తరగతులు ప్రారంభం: 01-07-2026
