
తెలంగాణ దేవాదాయ శాఖలో ప్రజావాణి తరహాలో ‘ధర్మవాణి’ ప్రారంభం
తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖలో ప్రజలు, అర్చకులు, ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం నూతన డైరెక్టర్ హనుమంతరావు ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 'ప్రజావాణి' తరహాలోనే దేవాదాయ శాఖలో ప్రతి సోమవారం 'ధర్మవాణి' పేరుతో వారపు ఫిర్యాదులు స్వీకరణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.ఈ కార్యక్రమం ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి దేవాదాయ శాఖ డైరెక్టర్ కార్యాలయం నిర్వహించబడుతుంది.
ఈ వేదిక ద్వారా శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు, అర్చకులు ఇతర భాగస్వాములు తమ సమస్యలను నేరుగా డైరెక్టర్‌కు తెలియజేయవచ్చు. అందిన ఫిర్యాదులను పరిశీలించి, నిజమైన సమస్యలను వెంటనే లేదా గరిష్టంగా ఒక వారంలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని డైరెక్టర్ పేర్కొన్నారు.
ఈ ఫిర్యాదులను డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ స్థాయిల్లో పెండింగ్‌లో ఉన్న అంశాలను కూడా ఈ సందర్భంగా పరిష్కరించేందుకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఫిర్యాదు పరిష్కారం అనంతరం దరఖాస్తుదారులకు సమాచారం అందించబడుతుంది. ఏదైనా కారణంతో సమస్య పరిష్కారం కాలేకపోతే, దానికి సంబంధించిన కారణాలను స్పష్టంగా వివరించనున్నట్లు తెలిపారు. శాఖకు చెందిన అందరూ ఈ వారపు ‘ధర్మవాణి’ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. ఈ కార్యక్రమం ద్వారా దేవాదాయ శాఖలో జాప్యాన్ని తగ్గించి, జవాబుదారీతనాన్ని పెంచడానికి ఈ చర్య దోహదపడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
