Let's talk: editor@tmv.in
తెలంగాణ కాంగ్రెస్ నేతలతో రాహుల్ గాంధీ భేటీ

తెలంగాణ కాంగ్రెస్ నేతలతో రాహుల్ గాంధీ భేటీ

Gaddamidi Naveen
16 నవంబర్, 2025

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శనివారం న్యూఢిల్లీలో కాంగ్రెస్ అగ్ర నాయకులు రాహుల్ గాంధీని మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ కీలక సమావేశంలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ , జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నూతనంగా ఎమ్మెల్యేగా గెలిచిన నవీన్ యాదవ్ సహా పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

తెలంగాణలో నూతనంగా ఏర్పాటైన ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై నాయకులు రాహుల్ గాంధీకి వివరించారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో చేపట్టాల్సిన కార్యాచరణ రాజకీయ వ్యూహాలపై కూడా ప్రధానంగా చర్చ జరిగింది.ఈ సందర్భంగా.. ఎమ్మెల్యే నవీన్‌ యాదవ్‌కు రాహుల్‌ శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాహుల్ గాంధీకి తెలియజేశారు.అలాగే న్యూఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేత‌లు మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పార్టీ అగ్ర నాయకత్వంతో జరిగిన ఈ భేటీకి అత్యధిక ప్రాధాన్యత ఏర్పడింది.

తెలంగాణ కాంగ్రెస్ నేతలతో రాహుల్ గాంధీ భేటీ - Tholi Paluku