Let's talk: editor@tmv.in
తెలంగాణలో 66 సివిల్ జడ్జి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

తెలంగాణలో 66 సివిల్ జడ్జి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

Shaik Mohammad Shaffee
1 డిసెంబర్, 2025

తెలంగాణలోని న్యాయ విద్యార్థులకు, న్యాయవాదులకు శుభవార్త. తెలంగాణ హైకోర్టు రాష్ట్రంలోని సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) పోస్టుల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 66 సివిల్ జడ్జి పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు డిసెంబర్ 8 నుంచి డిసెంబర్ 29 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు కేవలం ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను తెలంగాణ హైకోర్టు అధికారిక వెబ్‌సైట్ tshc.gov.inలో అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చదివి, ఆపై దరఖాస్తు చేసుకోవాలి. పరీక్ష తేదీలు, హాల్ టికెట్లు, కంప్యూటర్ ఆధారిత పరీక్షకు సంబంధించిన ఇతర వివరాలు త్వరలో హైకోర్టు అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటిస్తారు. న్యాయశాస్త్రంలో పట్టా పొందిన, జ్యుడీషియల్ సర్వీసెస్‌లో కెరీర్ ఆశించే వారికి ఈ నోటిఫికేషన్ ఒక మంచి అవకాశం.

సివిల్ జడ్జి కెరీర్ ఎలా ఉంటుంది?

సివిల్ జడ్జి అంటే కోర్టులో పౌర కేసులను విచారించి, ప్రజలకు న్యాయం చేసే ప్రభుత్వ అధికారి. ఇది చాలా ప్రతిష్టాత్మకమైన, గౌరవనీయమైన ఉద్యోగం. దీని కోసం తప్పనిసరిగా ఎల్‌ఎల్‌బీ చదివి, రాష్ట్రం నిర్వహించే జ్యూడీషియల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి. ఉద్యోగంలో కేసులను పరిశీలించడం, తీర్పులు ఇవ్వడం, కోర్టు నిర్వాహణ చూడడం వంటి బాధ్యతలు ఉంటాయి. వేతనం, అలవెన్సులు, నివాసం వంటి సౌకర్యాలు చాలా బాగా లభిస్తాయి. పనిలో ఒత్తిడి ఉన్నా కూడా సమాజానికి నేరుగా సేవ చేసే అవకాశం ఉంటుంది. అనుభవంతో జిల్లా జడ్జి, హైకోర్టు జడ్జి వరకు ఎదగవచ్చు. మొత్తంగా ఇది భద్రత, గౌరవం, ఎదుగుదల కలిగిన ఉత్తమ కెరీర్ మార్గం.

తెలంగాణలో 66 సివిల్ జడ్జి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ - Tholi Paluku