
తెలంగాణలో 11 మున్సిపాలిటీల్లో ఛైర్‌పర్సన్ల ఎన్నిక వాయిదా
Gaddamidi Naveen
17 ఫిబ్రవరి, 2026
తెలంగాణలోని 11 మున్సిపాలిటీల్లో సోమవారం జరగాల్సిన మున్సిపల్ ఛైర్‌పర్సన్, వైస్ ఛైర్‌పర్సన్ ఎన్నికలు అనూహ్యంగా వాయిదా పడ్డాయి. ఇల్లందు, సుల్తానాబాద్, ఇబ్రహీంపట్నం, కాగజ్‌నగర్, క్యాతనపల్లి, ఖానాపూర్, జహీరాబాద్, ఇంద్రేశం, డోర్నకల్, జనగామ, తొర్రూర్ మున్సిపాలిటీలో ఎన్నిక వాయిదా పడినట్లు అధికారులు వెల్లడించారు.
కొన్నిచోట్ల క్వారమ్ లేకపోవడం, మరికొన్ని ప్రాంతాల్లో రాజకీయ విభేదాలు, పరిపాలనా కారణాలు ఇందుకు కారణాలుగా తెలిసింది. ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు తదుపరి తేదీలను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించే అవకాశముంది. ఎన్నికల వాయిదాతో స్థానిక రాజకీయాల్లో ఆసక్తి నెలకొంది.
