
తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనలో కీలక మార్పులు చేస్తూ, పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ, మరికొందరికి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు.ఈ ఉత్తర్వులు శుక్రవారం విడుదలయ్యాయి.
సవ్యసాచి ఘోష్, ఐఏఎస్‌ను ప్రధాన కార్యదర్శి, సామాజిక సంక్షేమ శాఖ. (ప్రభుత్వ ఫ్లాగ్‌షిప్ కార్యక్రమాల అమలుపై పర్యవేక్షణ)కు బదిలీ చేశారు.ఇంతకుముందు ఉన్న సంక్షేమ డిపార్ట్మెంట్ కు స్పెషల్ కీ సెక్రటరీగా కూడా కొనసాగుతారు.అనితా రామచంద్రన్‌ను ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కు సెక్రటరీగాను ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కమిషనర్ గాను నియమించారు.ఇలంబర్తిని కె, మెట్రోపాలిటన్ ఏరియా అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ కు సెక్రటరీగా నియమించారు.బీసీ వెల్ఫేర్ కు సెక్రటరీగా ఉన్న ఇ. శ్రీధర్ ను జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కు సెక్రటరీగా నియమించారు.షేక్ యాసిన్ భాష ను తెలంగాణ కు మేనేజింగ్ డైరెక్టర్ గా అదనపు చార్జిగా నియమించారు.ఆదిలాబాద్ జిల్లా పరిషత్ సీఈఓ గా ఉన్న జితేందర్ రెడ్డిని ఎస్ సి డి స్పెషల్ కమిషనర్ గా నియమించారు. అలాగే తెలంగాణ షెడ్యూల్ క్యాస్ట్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కూడా నియమించారు.మహాత్మ జ్యోతిబాపూలే తెలంగాణ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ సెక్రటరీగా ఉన్న ఈ సైదులు ఫ్లాట్ షిప్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కి స్పెషల్ సెక్రటరీగా నియమించారు.
