Let's talk: editor@tmv.in
తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధుల సమీకరణకు కమిటీ ఏర్పాటు

తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధుల సమీకరణకు కమిటీ ఏర్పాటు

Gaddamidi Naveen
5 నవంబర్, 2025

ఉన్నత విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావడం, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి అవసరమైన నిధులను సమీకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ దిశగా ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (వెల్ఫేర్) అధ్యక్షతన ఉన్నతాధికారులు, నిపుణులతో కూడిన కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

కమిటీలో కీలక సభ్యులు

ఈ ఉత్తర్వు ప్రకారం కమిటీలో మొత్తం 13 మంది సభ్యులు ఉన్నారు.

ఈ కమిటీలో ప్రిన్సిపల్‌ సెక్రటరీ (ఫైనాన్స్) ఉపాధ్యక్షుడిగా, ఎడ్యుకేషన్‌ సెక్రటరీ, ఎస్‌సీ, బీసీ, ట్రైబల్‌, మైనారిటీ వెల్ఫేర్‌ శాఖల కార్యదర్శులు, స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఛైర్మన్, కమిషనర్ (ఎస్సీ డెవలప్మెంట్‌), ప్రొఫెసర్లు కాంచా ఇళయ, కోదండరామ్, అలాగే ఫాథి (తెలంగాణ ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య) నుంచి ముగ్గురు ప్రతినిధులు సభ్యులుగా నియమితులయ్యారు.

కమిటీ ప్రధాన ఉద్దేశాలు

• స్వయం సమర్థంగా నడిచే ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని రూపొందించడం.

• పథకం అమలులో పారదర్శకత, స్థిరత్వం, ఆర్థిక సమతుల్యతను కలిగించే విధాన సూచనలు అందించడం.

• తెలంగాణ ఉన్నత విద్యా వ్యవస్థను మెరుగుపరచే సూచనలను ఇవ్వడం.

మూడు నెలల్లో నివేదిక

కమిటీ వివరణాత్మక చర్చలు జరిపి, తగిన సిఫార్సులతో కూడిన నివేదికను మూడు నెలల్లో ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది. అనంతరం ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపడుతుంది.

తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధుల సమీకరణకు కమిటీ ఏర్పాటు - Tholi Paluku