
తెలంగాణలో పెరిగిన బీజేపీ బలం: ఎన్. రామచందర్ రావు
మున్సిపల్ ఎన్నికల ఫలితాలు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఎదుగుదలకు నిదర్శనమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు స్పష్టం చేశారు. సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పార్టీ సాధించిన విజయాలను విశ్లేషించారు.
మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు తెలిపిన ఓటర్లందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఎన్నికల్లో పార్టీకి గతంతో పోలిస్తే ఓట్ల శాతం, స్థానాలు పెరిగాయని పేర్కొన్నారు. కరీంనగర్ కార్పొరేషన్‌తో పాటు నారాయణపేట, భైంసా మున్సిపాలిటీలలో బీజేపీ చైర్‌పర్సన్ పదవులను కైవసం చేసుకోవడం పార్టీకి ముఖ్య విజయమని తెలిపారు. కరీంనగర్‌లో చరిత్రలో తొలిసారిగా బీజేపీ మేయర్ పీఠాన్ని దక్కించుకోవడం ప్రత్యేకమని ఆయన అన్నారు. అనేక మున్సిపాలిటీలలో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిందని, 15కు పైగా స్థానాల్లో ఆధిక్యం సాధించిందని ఆయన చెప్పారు.
భైంసాలో గతంలో బీజేపీ కార్యకర్తలపై కేసులు నమోదయ్యాయని, అప్పట్లో న్యాయవాదిగా పలువురికి బెయిల్ ఇప్పించిన విషయాన్ని గుర్తుచేశారు. కొన్నిచోట్ల బీజేపీ ఎదుగుదలను అడ్డుకునేందుకు ఇతర రాజకీయ పార్టీలు కలిసి పనిచేశాయని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, భైంసాలో గతంలో బీజేపీ కార్యకర్తలపై కేసులు నమోదయ్యాయని, అప్పట్లో న్యాయవాదిగా పలువురికి బెయిల్ ఇప్పించిన విషయాన్నిఆయన గుర్తుచేశారు. కొన్నిచోట్ల బీజేపీ ఎదుగుదలను అడ్డుకునేందుకు ఇతర రాజకీయ పార్టీలు కలిసి పనిచేశాయని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, మజ్లిస్, కమ్యూనిస్టు పార్టీల మధ్య సంబంధాలపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఖమ్మం, వరంగల్, కొత్తగూడెం, పరకాల వంటి ప్రాంతాల్లో బీజేపీ ప్రభావం పెరిగిందని పేర్కొన్నారు. అలాగే నిజామాబాద్ లో 28 స్థానాల్లో విజయం సాధించి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచినట్లు తెలిపారు. నిర్మల్ లో ఒక వార్డులో మైనార్టీ ఓట్ల పెరుగుదలపై అనుమానాలు ఉన్నాయని, దీనిపై ఫిర్యాదు చేసినట్లు ఆయన వెల్లడించారు.
రాష్ట్రంలో అధికార పార్టీకి కూడా స్పష్టమైన మెజార్టీ రాలేదని, ప్రజల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోందని రామచందర్ రావు అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తోందని, తెలంగాణలో కూడా అదే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. ఏప్రిల్‌లో సర్ ప్రక్రియ చేపట్టి హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా దొంగ ఓట్లను తొలగించే చర్యలు తీసుకుంటామని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
