Let's talk: editor@tmv.in
తెలంగాణలో పెరిగిన చికెన్ ధరలు.. తగ్గిన గుడ్ల ధరలు

తెలంగాణలో పెరిగిన చికెన్ ధరలు.. తగ్గిన గుడ్ల ధరలు

Gaddamidi Naveen
15 మార్చి, 2026

తెలంగాణ రాష్ట్రంలో మాంసం ప్రియులకు చికెన్ ధరలు చుక్కలు చూపిస్తుండగా, గుడ్డు ధరలు మాత్రం భారీగా తగ్గుముఖం పట్టాయి. మార్కెట్‌లో నెలకొన్న విభిన్న పరిస్థితులు, అంతర్జాతీయ పరిణామాలు పౌల్ట్రీ రంగంపై భిన్నమైన ప్రభావం చూపుతున్నాయి.

రాష్ట్రంలోని పలు మార్కెట్లలో ప్రస్తుతం చికెన్ ధరలు పెరిగిన స్థాయిలో కొనసాగుతున్నాయి. రైతు స్థాయిలో కిలో చికెన్ ధర సుమారు రూ.180గా ఉండగా, హోల్‌సేల్ మార్కెట్‌లో అది రూ.187 వరకు ఉంది. రిటైల్ మార్కెట్‌లో వినియోగదారులు కిలోకు సుమారు రూ.207 చెల్లించాల్సి వస్తోంది. డ్రెస్డ్ చికెన్ ధర కిలోకు రూ.300కు చేరగా, స్కిన్‌లెస్ చికెన్ ధర రూ.342 వరకు పెరిగింది. వేసవి కాలం ప్రారంభం కావడం, శుభకార్యాలు, పెళ్లిళ్ల సీజన్ కావడంతో చికెన్‌కు డిమాండ్ ఒక్కసారిగా మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

చికెన్ ధరలు పెరుగుతుంటే, గుడ్ల ధరలు మాత్రం గణనీయంగా పడిపోయాయి. శనివారం మార్కెట్‌లో వంద గుడ్ల ధర రూ.515 కాగా, డజన్‌ ధర 62గా ఉంది. దీనికి ప్రధాన కారణం పశ్చిమాసియా యుద్ధం. గల్ఫ్ దేశాలకు భారత్ నుంచి భారీగా గుడ్ల ఎగుమతులు జరుగుతుంటాయి. అయితే ప్రస్తుత యుద్ధ పరిస్థితుల వల్ల ఎగుమతులు నిలిచిపోవడంతో, ఆ నిల్వలన్నీ దేశీయ మార్కెట్‌కు మళ్లాయి. దీనివల్ల సరఫరా పెరిగి ధరలు తగ్గవల్సి వచ్చింది.

రైతుల ఆవేదన

ఒకవైపు ఉత్పత్తి ఖర్చులు పెరుగుతుంటే, మరోవైపు గుడ్ల ధరలు పడిపోవడం పట్ల పౌల్ట్రీ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వినియోగదారులకు చికెన్ భారం కాగా, ధరలు లేక రైతులు నష్టపోతున్న విచిత్ర పరిస్థితి ప్రస్తుతం తెలంగాణలో కనిపిస్తోంది.ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది.