Let's talk: editor@tmv.in
తెలంగాణలో పెరిగిన ఏసీబీ కేసులు

తెలంగాణలో పెరిగిన ఏసీబీ కేసులు

Pinjari Chand
1 జనవరి, 2026

తెలంగాణ యాంటీ-కరప్షన్ బ్యూరో (ఏసీబీ) 2025 సంవత్సరంలో మొత్తం 199 కేసులు నమోదు చేసి, 273 మంది వారిని అరెస్ట్ చేసిందని ఉన్నతాధికారి ఒకరు బుధవారం తెలిపారు. అంటే సగటున ప్రతి 2 రోజులకు ఒక కేసు నమోదయింది. ఈ కేసులలో 157 కేసులు లంచం తీసుకోవడం/లంచం అడగడం వంటి ఏసీబీ ట్రాప్ చేసి పట్టుకున్న ఆపరేషన్లుగా ఉండగా, వీటిలో 224 మంది అరెస్ట్ అయ్యారు. వీరిలో 176 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. అదనంగా, 15 కేసులు ప్రభుత్వ ఉద్యోగులపై ఆదాయానికి మించిన ఆస్తుల (డీఏ) కేసులుగా ఉండగా, 26 కేసులు ఇతర రకాల ప్రభుత్వ అవినీతి/చెల్లని ప్రవర్తనలకు సంబంధించి నమోదయ్యాయి.ఈ కేసుల్లో రూ.96.13 కోట్లు విలువైన ఆస్తులను గుర్తించింది. ఈ కేసులలో 34 మంది అరెస్ట్ అయ్యారని ఏసీబీ డైరెక్టర్ జనరల్ చారూ సిన్హా తెలిపారు. ట్రాప్ కేసుల్లో ఏసీబీ మొత్తం రూ. 57.17 లక్షలను స్వాధీనం చేసుకుంది. వీటిలో రూ. 35.89 లక్షలు ఫిర్యాదు చేసిన వారికి తిరిగి చెల్లించారు. అలాగే 15 డీఏ కేసులలో రూ. 96 కోట్లు పైగా ఆస్తులను ఏసీబీ గుర్తించిందని తెలిపారు.

ఏసీబీ 115 మంది అవినీతి పరులైన ప్రభుత్వ సాంక్షన్ ఆర్డర్లు పొందిన తర్వాత ఛార్జ్‌షీట్లను దాఖలు చేసింది. అదనంగా 26 సాధారణ అవినీతి విచారణలు, 54 అకస్మిక తనిఖీలు (సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, ఆర్టీఏ చెక్ పోస్ట్‌లు, వెల్ఫేర్ హాస్టల్స్) నిర్వహించినట్లు వివరించారు. డీజీ చారూ సిన్హా మాట్లాడుతూ, ఈ చర్యలు రాష్ట్రంలో అవినీతిని తగ్గించడం పునర్వ్యవస్థాపన, సమగ్ర తనిఖీ వ్యవస్థను బలోపేతం చేయడం కోసం ఏసీబీ తీసుకుంటున్న కొనసాగుతున్న ప్రయత్నాలను ప్రతిబింబిస్తున్నాయని పేర్కొన్నారు. 2024లో 152 కేసులు నమోదుకాగా 223 మంది అరెస్టయ్యారు. అయితే ఈసారి గతం కంటే కేసులు పెరగడం ప్రభుత్వ వ్యవస్థల్లో అవినీతి పెరగడం ప్రభుత్వాన్ని కలవరపరుస్తోంది. 2022లో అంటే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏసీబీ కేసులు 105 నమోదయ్యాయి.