
తెలంగాణలో టెట్ పరీక్షల నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ జనవరి 2026 నిర్వహణకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ప్రభుత్వం విడుదల చేసింది . నవంబర్ 15వ తేదీ నుంచి అభ్యర్థుల నుంచి ఈ దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ దరఖాస్తులు స్వీకరణకు తుది గడువు నవంబర్ 29వ తేదీతో ముగియనుంది. జనవరి 3 నుంచి 31వ తేదీ వరకు టెట్ పరీక్షలు నిర్వహిస్తారు. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది.
కాగా.. 2025 ఏడాదికి సంబంధించి తొలి విడత టెట్ నోటిఫికేషన్ గత జూన్‌లో విడుదల చేశారు. ఇప్పటికే పరీక్షలు పూర్తి చేయగా.. జులై 22న ఫలితాలు సైతం వెల్లడించారు. తాజాగా రెండో విడత టెట్ నోటిఫికేషన్ ఈ రోజు విడుదల చేశారు. ఇక ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు సైతం టెట్‌లో అర్హత సాధించాలంటూ ఇప్పటికే సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలో తమ ఉద్యోగాల్లో కొనసాగాలంటే.. టీచర్లంతా ఈ టెట్ పాస్ కావాల్సి ఉంది.
ముఖ్య సమాచారం....
• టెట్ పరీక్షలు ఆన్‌లైన్ మోడ్‌లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష రూపంలో నిర్వహించనున్నారు.
• నోటిఫికేషన్ విడుదల : నవంబర్ 14, 2025
• దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : నవంబర్ 15, 2025
• దరఖాస్తుకు చివరి తేదీ : నవంబర్ 29, 2025
• పూర్తి సమాచార బులిటెన్ అందుబాటు : నవంబర్ 15, 2025 నుంచి
• పరీక్షల తేదీలు : జనవరి 03, 2026 నుంచి జనవరి 31, 2026 వరకు
దరఖాస్తు విధానం....
• అర్హత కలిగిన మరియు ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://schooledu.telangana.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
