
తెలంగాణలో ఘనంగా సర్దార్ పటేల్ 150వ జయంతి వేడుకలు
భారతదేశ ఏకీకరణ కర్త సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని, శుక్రవారం హైదరాబాద్‌లో జాతీయ ఏక్తా దివస్ 2025 వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఐక్యతా పరుగు కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పలువురు నేతలు ఈ ఐక్యతా పరుగు కార్యక్రమంలో పాల్గొనడం గొప్ప గౌరవంగా భావించామని తెలిపారు. ముఖ్యంగా, ఈ కార్యక్రమానికి భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు హాజరై, సభనుద్దేశించి ప్రసంగించడం అదనపు ఆకర్షణగా నిలిచింది.విశాల భారత సమైక్యతా స్ఫూర్తి సర్దార్ వల్లభభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా హైదరాబాద్ లోని అసెంబ్లీ వద్ద గల వారి విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం ఆయన మాట్టాడుతూ.. భారత స్వరాజ్య సంగ్రామానికి సమున్నత ముగింపును అందించిన క్రాంతదర్శిగా... నవభారత నిర్మాతగా, రాజనీతిజ్ఞుడిగా వారి ప్రేరణ అజరామరమైనది. ఐక్యతనే స్ఫూర్తి మంత్రంగా అందించిన వారి జయంతిని రాష్ట్రీయ ఏకతా దివస్ గా గుర్తించుకోవడం సముచితం. భారతదేశాన్ని ఏకం చేసే లక్ష్యాన్ని స్వీకరించి.. వ్యూహం, సహనం, శాంతి, గౌరవ ప్రదంగా ఒప్పించే మార్గాల్లో స్వాతంత్ర్యానంతరం అన్ని సంస్థానాలను భారతదేశంలో విలీనం చేయించి వారు సాధించిన విజయం భవిష్యత్ భారతానికి ప్రేరణాత్మకమైనది. వారి స్ఫూర్తితో యువతరం వికసిత భారత నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తున్నాను అని ఆయన తెలిపారు.
అంతకుముందు, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు నాంపల్లి-సైఫాబాద్‌లోని శాసనసభ సమీపంలో ఉన్న సర్దార్ పటేల్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.భారతదేశ సమైక్యత కోసం సర్దార్ పటేల్ చేసిన సేవలు, ఆయన స్ఫూర్తిని ఈ 'రన్ ఫర్ యూనిటీ' ద్వారా ప్రజలు, ముఖ్యంగా యువతరం గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు సామాన్య ప్రజలు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు.
మహబూబ్ నగర్‌లో రన్ ఫర్ యూనిటీ 2కే రన్
మహబూబ్ నగర్ లోని స్టేడియం గ్రౌండ్ నుంచి మొదలైన ఈ రన్ ఫర్ యూనిటీ 2కే రన్ అంబేద్కర్ సర్కిల్, అశోక్ టాకీస్, ఓల్డ్ బస్ స్టాండ్, మీదుగా క్లాక్ టవర్ వరకు సాగింది. పటేల్ 150వ జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మహబూబ్ నగర్ లో శుక్రవారం రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కలెక్టర్ విజయేందిరబోయి, ఎస్పీ జానకి, యువ భారత్ కేంద్రం జిల్లా ఇంచార్జి కోటా నాయక్, బీజెపి ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ప్రజలతో కలిసి 2 కిలోమీటర్ల (రన్ ఫర్ యూనిటీ) మార్చ్ లో పాల్గొన్నారు. ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పాలమూరు యూనివర్సిటీ విద్యార్థులు, పలు ప్రభుత్వ ప్రయివేట్ పాఠశాలల విద్యార్థులు, యువకులు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు, ప్రజలందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను.
ఉప్పల్ లో ‘ఏక్తా రన్'లో రాచకొండ కమిషనర్ 2కే రన్
రాష్ట్రీయ ఏక్తా దివాస్ సందర్భంగా రాచకొండ కమిషనరేట్ పోలీసులు రన్ ఫర్ యూనిటీని రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు, సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్, ఎవరెస్ట్ అధిరోహించిన అన్విత రెడ్డి,అథ్లెంటిక్ కల్పన రెడ్డిలు జెండా ఊపి రన్ ప్రారంభించారు.ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి ఉప్పల్ క్రికెట్ స్టేడియం వరకు 2కే రన్ నిర్వహించారు.భారతదేశంలో ఉన్న పౌరులు అందరూ ఏకతాటిపై ఉన్నారు అని తెలియజేయడానికి రన్ ఫర్ యూనిటీ అని అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమంలో రాచకొండ పోలీసు ఉన్నతాధికారులు, డీసీపీ మల్కాజిగిరి పద్మజ ఐపిఎస్, డీసీపీ క్రైమ్స్ అరవింద్ బాబు తదితరులు పాల్గొన్నారు.
