
తెలంగాణను 'గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్' గా మార్చడమే లక్ష్యం:మంత్రి శ్రీధర్ బాబు
తెలంగాణ రాష్ట్రం లైఫ్ సైన్సెస్, ఆవిష్కరణల రంగంలో ప్రపంచ నాయకత్వం వైపు నడిపించడంలో ఆస్ట్రేలియాలోని ఆర్‌ఎంఐటీ యూనివర్సిటీతో రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న భాగస్వామ్యం ఒక మైలురాయిగా నిలుస్తోందని ఐటీ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఆస్ట్రేలియాలోని అగ్రశ్రేణి సంస్థల్లో ఒకటైన ఆర్‌ఎంఐటీ యూనివర్సిటీతో ఈ వ్యూహాత్మక సహకారం లైఫ్ సైన్సెస్ రంగంలో పరిశోధన అధునాతన విద్య పరిశ్రమల అనుసంధానాన్ని బలోపేతం చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాన్ని పటిష్టం చేస్తుందని మంత్రి పేర్కొన్నారు.
పరిశ్రమకు సిద్ధంగా ఉన్న గ్లోబల్ వర్క్‌ఫోర్స్
తెలంగాణ ప్రభుత్వ శాఖల సమన్వయంతో విద్యార్థులు పరిశోధకులు పరిశ్రమ వర్గాల మధ్య సహకారం పెంచే పాఠ్యక్రమాలు, శిక్షణా కార్యక్రమాలు ఇన్నోవేషన్ హబ్‌లు, ప్రయోగశాలలు ఏర్పాటు చేయబడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ భాగస్వామ్యం ద్వారా కేవలం భారతదేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా ప్రతిభావంతులను ఆకర్షించడం, జీవవిజ్ఞాన రంగంలో నూతన పరిశోధనలు టెక్నాలజీ రూపొందించడం కూడా లక్ష్యమని మంత్రి తెలిపారు.
ఈ ప్రాజెక్ట్ ద్వారా జీనోమ్ వ్యాలీ యొక్క తదుపరి దశలో వృద్ధిని రూపొందించడంలో, తెలంగాణను ప్రపంచ జీవవిజ్ఞాన రంగంలో ప్రముఖ స్థానంలో నిలబెట్టడం లక్ష్యం. ఇప్పటికే రాష్ట్రంలో 2,000కుపైగా ఫార్మా బయోటెక్ కంపెనీలు పనిచేస్తున్నాయి. ఇవి స్థానిక ప్రతిభ పరిశోధన నైపుణ్యాలు అంతర్జాతీయ సహకారాన్ని జోడించడం ద్వారా మేము 2030 నాటికి 250 బిలియన్ డాలర్ల లైఫ్ సైన్సెస్ రంగాన్ని సాధించే లక్ష్యం వైపు నిరంతరం కృషి చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ఆర్‌ఎంఐటీతో మా సహకారం ఈ లక్ష్య సాధనకు మరింత ఊతం ఇస్తుందని మంత్రి శ్రీధర్ బాబు సూచించారు. ఇన్నోవేషన్, అంతర్జాతీయ భాగస్వామ్యాల ద్వారా తెలంగాణను ప్రపంచ స్థాయిలో “లైఫ్ సైన్సెస్ ఎకానమీ”లో అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రభుత్వం సన్నద్ధంగా పని చేస్తున్నదని మంత్రి పేర్కొన్నారు.
పెట్టుబడులు, పరిశ్రమల స్థితి
తెలంగాణ రాష్ట్రం జీవవిజ్ఞాన రంగంలో గణనీయమైన పురోగతిని సాధించింది. ఇటీవల, 2024 డిసెంబర్ నుండి 2025 ఆగస్టు వరకు, ఈ రంగంలో రూ. 54,000 కోట్ల పెట్టుబడులు ఆకర్షించబడినట్లు తెలంగాణ జీవవిజ్ఞాన మండలి ప్రకటించింది.హైదరాబాద్‌లోని జెనోమ్ వ్యాలీ, 2000కి పైగా బయోటెక్, ఫార్మా కంపెనీలతో, ప్రపంచంలోని అగ్రగామి ఆర్&డీ సంస్థలలో ఒకటిగా గుర్తించబడింది.ఈ పెట్టుబడుల ద్వారా సుమారు 2 లక్షల కొత్త ఉద్యోగాలు సృష్టించబడినట్లు సమాచారం.
