
తెలంగాణకు బీఆర్ఎస్ శ్రీరామరక్ష: హరీష్ రావు
జహీరాబాద్ నియోజకవర్గం న్యాల్కల్ మండలంలోని పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు నాయకత్వంలో మాజీ మంత్రి హరీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరడం రాజకీయ పరిణామంగా మారింది. ఈ సందర్భంగా హరీష్ రావు కొత్తగా చేరిన నాయకులను గులాబీ కండువా కప్పి స్వాగతించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరిష్ రావు మాట్టాడుతూ.. తెలంగాణ ప్రజల నైతికంగా, రాజకీయంగా మార్గనిర్దేశం చేస్తోందని ఆయన స్పష్టం చేశారు జిల్లా పరిషత్ స్థాయిలో సంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ కైవసం చేసుకోబోతుందని తెలిపారు.అలాగే ఉమ్మడి మెదక్ జిల్లాలో గులాబీ జెండా ఎగురుతుందని జహీరాబాద్ నియోజకవర్గంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను భారీ మెజారిటీతో గెలుచుకుంటామని తెలిపారు.
కాంగ్రెస్, బీజేపీల గురించి మాట్లాడుతూ హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు "ఒకటి మోసపు చరిత్ర, మరొకటి ద్రోహపు చరిత్ర" అన్నారు.చోటా భాయ్,బడే భాయ్ ఇద్దరిదీ ఒకే తీరని మండి పడ్డారు. ఇద్దరూ తెలుగు ప్రజలను మోసం చేశారని, కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు గుండు సున్నా ఇచ్చారని ఎద్దేవా చేశారు. ఎనిమిది మంది ఎంపీలను గెలిపించాం అన్న కృతజ్ఞత కూడా కేంద్ర బీజేపీ ప్రభుత్వం కనపర్చలేదని తెలిపారు.
హరీష్ రావు కేంద్ర ప్రభుత్వ హామీలను గుర్తు చేస్తూ ప్రజలకు మోసం ఎలా చేశారో వివరించారు. "నల్లధనం తెచ్చి రూ.15 లక్షలు ఇస్తామన్న హామీ ఏమైంది? 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పిన వాగ్దానం ఏ మడుగులో పడింది?" అని ప్రశ్నించారు.పేదలందరికీ ఇళ్లు,బుల్లెట్ రైళ్లు వంటి హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు.అలాగే గ్యాస్ సిలిండర్ ధర రూ.300 నుంచి 1200కి, పెట్రోలు రూ.65 నుంచి రూ. 100కి పైకి పెరగడం వెనుక ఉన్న బాధ్యత బీజేపీదేనని అన్నారు. జీఎస్టీ వల్ల సామాన్య ప్రజలకు జరిగిన భారాన్ని వివరిస్తూ “పప్పు, ఉప్పు, సబ్బు, నూనె, బట్టలు, సైకిల్, కారు అన్నీ ధరలు పెరిగాయి. ఇది ప్రజలపై పెట్టిన భారం.”ఎన్నికల ముందే ధరలు తగ్గించి, అనంతరం మళ్లీ పెంచడం బీజేపీ డ్రామా అని విమర్శించారు.
తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ శ్రీరామరక్ష అని హరీష్ రావు పేర్కొన్నారు. "తెలంగాణా రాష్ట్రాన్ని ప్రాణంగా భావించిన నాయకుడు కేసీఆర్. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తోందని అన్నారు.రేవంత్ రెడ్డి ని నమ్మి ఓటేసిన ప్రజలను నట్టేట ముంచుతున్నాడని తెలిపారు.యూరియా కోసం రైతులు పడుతున్న తిప్పలు ఈ ప్రభుత్వం వైఫల్యం గురిచెప్పుతున్నాయన్నారు. ఈ ప్రభుత్వనికి రైతుల పట్ల ఎందుకు అంత వివక్ష అన్నారు. ఈ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ వచ్చే ఎన్నికల్లో విజయం కోసం అందరూ సమిష్టిగా కృషి చేయాలి. ప్రజల్లో బీజేపీ, కాంగ్రెస్‌ల వాస్తవ స్వరూపాన్ని ప్రజలకు వెల్లడించాలని.రెండు పార్టీలకు బుద్ది చెప్పాలని తెలిపారు.
