Let's talk: editor@tmv.in
తూమాటి మాధవరావుకు జగన్‌ అభినందనలు

తూమాటి మాధవరావుకు జగన్‌ అభినందనలు

Pinjari Chand
20 ఆగస్టు, 2026

ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. డిప్యూటీ ఛైర్మన్‌గా తనకు అవకాశం కల్పించినందుకు జగన్‌కు మాధవరావు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ.. పదవికి వన్నె తెచ్చేలా బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాధవరావు తన కుటుంబ సభ్యులతో కలిసి జగన్‌ను కలిశారు. డిప్యూటీ ఛైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన మాధవరావును జగన్‌ అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు వైఎస్సార్‌సీపీకి చెందిన శాసనమండలి సభ్యులు కూడా జగన్‌ను కలిశారు. మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నికైన నేపథ్యంలో ఆయనకు ఎమ్మెల్సీలు అభినందనలు తెలిపారు.