
తిరుమల లోని అలిపిరి వద్ద ఉన్న పాదాల మండపం పునరుద్ధరణ
పుణెకు చెందిన శ్రీ వెంకటేశ్వర ఛారిటబుల్ అండ్ రిలీజియస్ ట్రస్ట్ అలిపిరి వద్ద ఉన్న పాదాల మండపం పునరుద్ధరణ పనులను త్వరలో చేపట్టబోతోంది, ఈ అసలు మండపం విజయనగర సామ్రాజ్యం కాలంలో నిర్మించబడింది. పురావస్తు శాఖ వారు ఈ మండపం పునరుద్ధరణ కోసం ఈ క్రింది చర్యలు తీసుకోనున్నారని పురావస్తు శాఖ డైరెక్టర్ డాక్టర్ మునిరత్నం రెడ్డి చెప్పారు.
మండపం వాస్తు నిర్మాణo లో ఇప్పటికే వున్న కప్పు పలకలు , కప్పు దూలాలు, గోడలు మొదలైన అన్ని విషయాలకు ఒక డాక్యుమెంటేషన్ సంఖ్య ఇవ్వబడుతుంది, వాటి అసలు అమరికతో పాటు, ప్రతి వాస్తు నిర్మాణం పేరు స్పష్టంగా కనిపించేలా గుర్తు పెడతాము. నేల , దూలం, కప్పు వంటి ముఖ్యమైన అంశాలన్నీ తాత్కాలిక బెంచ్ మార్క్ ఆధారంగా ప్రక్కనే ఉన్న శాశ్వత వస్తువులు, నిర్మాణాలపై స్పష్టంగా కనిపించే విధంగా సులభంగా ఎక్కడ ఏమి ఉండాలో గుర్తుపట్టేవిదంగా ఉంచుతాము అని పురావస్తు శాఖవారు ప్రకటించారు. తొలగించడానికి ముందు, ప్రతి అసలు వాస్తు నిర్మాణం యొక్క డాక్యుమెంటేషన్ సంఖ్యను స్పష్టంగా చూపిస్తూ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అయిన ఆటో క్యాడ్ ఉపయోగించి అన్ని వైపుల వివరణాత్మక ప్లాన్‌లు, ఎలివేషన్లు సెక్షన్‌లు సాఫ్ట్, హార్డ్ కాపీలలో సిద్ధం చేస్తాము అన్నారు.
ఫోటో, వీడియో డాక్యుమెంటేషన్: మండపం మొత్తం నిర్మాణాన్ని లోపల, వెలుపల అన్ని వైపుల నుండి హెఛ్ డి కెమెరాలు, డ్రోన్ , ఫోటోగ్రామెట్రీ ఉపయోగించి పూర్తిగా ఫోటో, వీడియో రూపంలో డాక్యుమెంటేషన్ చేస్తాము అన్నారు. ఈ డేటాను హార్డ్ ,సాఫ్ట్ కాపీలలో సురక్షితంగా భద్రపరుస్తాము అన్నారు.
శాస్త్రీయ తొలగింపు: అవసరమైన చోట్ల స్కఫోల్డింగ్ ప్రోపింగ్, ఏర్పాటు చేసి, నిర్మాణాలకు ఎటువంటి నష్టం కలగకుండా అన్నిటిని జాగ్రత్తగా తొలగిస్తాము అన్నారు.
తొలగించిన వాటినన్నింటినీ దగ్గరలోని స్థలంలో క్రమబద్ధంగా పేర్చి ప్రతి నిర్మాణ స్థానం ఎక్కడ పేర్చబడింది ,ఎక్కడికి తరలించబడింది అనే దానిని చూపుతూ ఈ లేఅవుట్‌ను సిద్ధం చేస్తామన్నారు.
సంప్రదాయ పద్ధతులను ఉపయోగించి తగిన పునాదిని రూపొందించి, తిరిగి వాటిని యాదాస్థానం లో అమర్చడం కోసం క్రమబద్ధమైన ప్రణాళిక వేసుకుంటాం, తొలగించబడిన అన్ని అసలు వాస్తు నిర్మాణాలను, ముందుగా డాక్యుమెంటేషన్ చేసిన స్థాయుల ఆధారంగా, వాటి స్థాయులు, స్థానాలకు అవసరమైన తనిఖీలను వర్తింపజేస్తూ, అసలు స్థానాలలో తిరిగి అమరుస్తాం అన్నారు. నీరు చొరబడకుండా చేయడం కోసం తిరిగి అమర్చిన తరువాత మండపం కప్పుకు సంప్రదాయ పద్ధతులను మాత్రమే ఉపయోగిస్తూ, గతంలో విరిగిపోయిన అసలు వాస్తు నిర్మాణాలను కొత్త రాళ్లతో మార్చడానికి బదులుగా పాతవాటినే సరిగ్గా మరమ్మత్తు చేసి పెడతాం అన్నారు. అసలు నిర్మాణాలు కనిపించకుండా పోయినప్పుడు మాత్రమే సమీప ప్రాంతంలో దొరికిన కొత్త రాళ్లను ఉపయోగిస్తాo అన్నారు. పురావస్తు శాఖ ప్రాచీన దేవాలయాలను రక్షించండి ,సంరక్షించండి….అనే నినాదాన్ని వ్యాప్తి చేస్తుంది.
