Let's talk: editor@tmv.in
తిరుమల అన్నప్రసాదం ట్రస్ట్‌కు రూ. కోటి విరాళం

తిరుమల అన్నప్రసాదం ట్రస్ట్‌కు రూ. కోటి విరాళం

Panthagani Anusha
27 మార్చి, 2026

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారి భక్తులకు అన్నప్రసాద వితరణ కోసం నిర్వహించే శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్‌కు భారీ విరాళం అందింది. చెన్నై షాపింగ్ మాల్‌గా సుపరిచితమైన మర్రి రిటైల్ లిమిటెడ్' సంస్థ గురువారం స్వామివారికి కోటి రూపాయల విరాళాన్ని అందజేసింది.

తిరుపతిల టీటీడీ చైర్మన్ బి.ఆర్.నాయుడు క్యాంప్ కార్యాలయంలో మళ్ళి రిటైల్ లిమిటెడ్ చైర్మన్ మర్రి వెంకటరెడ్డి ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సంస్థ తరపున రూ.1 కోటి విలువైన చెక్కును చైర్మన్‌కు అందజేశారు. దాతల నుంచి అందుతున్న ఇటువంటి భారీ విరాళాలు శ్రీవారి భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి దోహదపడతాయని ఈ సందర్భంగా టిటిడి ఉన్నతాధికారులు హర్షం వ్యక్తం చేశారు.

కాగా 2001లో స్థాపించన ఈ ట్రస్ట్ ద్వారా తిరుమలకు వచ్చే లక్షలాది మంది భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాద వితరణ జరుగుతోంది. కేవలం ఆహారమే కాకుండా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలోనూ ఈ ట్రస్ట్ నిధులను వినియోగిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత సంపన్న హిందూ దేవాలయంగా గుర్తింపు పొందిన తిరుమల క్షేత్రంలో భక్తుల సౌకర్యార్థం టీటీడీ నిర్వహిస్తున్న ఈ సేవా యజ్ఞంలో భాగస్వాములు కావడంపై దాతలు సంతోషం వ్యక్తం చేశారు.