Let's talk: editor@tmv.in
తిరుపతి నెల్లూరుల్లో దిత్వా తుఫాన్ వల్ల భారీ వర్షాలు

తిరుపతి నెల్లూరుల్లో దిత్వా తుఫాన్ వల్ల భారీ వర్షాలు

Dantu Vijaya Lakshmi Prasanna
2 డిసెంబర్, 2025

తుఫాను ‘దిత్వా’ యొక్క అవశేషమైన తీవ్ర అల్పపీడనం తీరానికి సమాంతరంగా ఉత్తరం వైపు కదులుతోందని ప్రస్తుతం చెన్నైకి 40 కి.మీ దూరంలో ఉందని రాష్ట్ర ఐఎమ్‌డి డైరెక్టర్ డాక్టర్ స్టెల్లా తెలిపారు. దీని ప్రబావం వల్ల దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమ ప్రాంతాలలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయి. తిరుపతి, నెల్లూరు జిల్లాలలో భారీ వర్షాలు పడుతున్నాయి. గంటకు 60 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. రేపటి వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లకూడదని, ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించడమైనదని స్టెల్లా అన్నారు.

హోం మంత్రి అనిత మాట్లాడుతూ, దిత్వా తుఫాన్ ని సమర్థవంతంగా ఎదుర్కోన్నాం. శ్రీలంక మునిగిపోవడం మనం చూసాం.దిత్వా తుఫాన్ వలన శ్రీలంక అతలాకుతలంఅయింది. ఎక్కువ ప్రాణనష్టం కూడా జరిగింది. దిత్వా తుఫాను వలన కొన్ని చోట్ల వర్షాలు వర్షాలు కురిస్తున్నాయి. ఆయా జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేశాం. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నాం. ఎలాంటి తుఫాను వచ్చినా ప్రభుత్వ యంత్రాంగం సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. విపత్తుల నిర్వహణ సంస్థ,ఆర్టీజీఎస్ ద్వారా ప్రజలను నిరంతరం అప్రమత్తం చేస్తున్నాం. విపత్తుల సమయాల్లో ప్రజలు కూడా ప్రభుత్వానికి సహకరించాలి అన్నారు.

దిత్వా తుఫాన్ క్రమంగా బలహినపడి, ప్రస్తుతం తీవ్ర వాయుగుండంగా కొనసాగుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వాహణ సంస్థ అధికారులు తెలిపారు. తుఫాను మరింతగా బలహనపడి వాయుగుండంగా మారుతోందని వెల్లడించారు. ఇది ప్రస్తుతం నైరుతీ, పశ్చిమ మధ్య బంగాళాఖాతాలను ఆనుకుని కొనసాగుతోందని వివరించారు.ఈ వాయగుండం చైన్నై తీరానికి దగ్గరగా ఉత్తరదిశగా పయనిస్తోందని తెలిపారు. తుఫాను గంటకు ఐదు కిలోమీటర్ల వేగంతో కదులుతుందని చెప్పుకొచ్చారు. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. అలాగే ఒకటి, రెండు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. తీరం వెంబడి బలమైన గాలలు వీస్తాయని తెలిపారు. మత్సకారులు వేటకు వెళ్లకూడదని సూచించారు. దిత్వా తుఫాను ప్రభావం దృష్ట్యా ప్రజలు సరైన జాగ్రత్తలు పాటించాలని దిశానిర్దేశం చేశారు.

దిత్వా తుఫాను హెచ్చరికల నేపథ్యంలో విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారని ఏపీ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. సముద్ర తీర ప్రాంత జిల్లాల్లో విద్యుత్ సిబ్బంది ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారని వివరించారు. ఎలాంటి ఇబ్బంది జరిగినా ఆదుకునేందుకు విద్యుత్ సిబ్బంది సిద్ధంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. సోమవారంప్రకాశం జిల్లాలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మంత్రి గొట్టిపాటి మాట్లాడారు.