
తొలిసారి మండలిలో నాగబాబు
జనసేన నాయకుడు కొణిదల నాగేంద్ర బాబు ( నాగబాబు) తొలిసారిగా శాసనమండలిలో అడుగుపెట్టారు. 2019 ఎన్నికల్లో నరసాపురం నుంచి లోక్ సభకు పోటీ చేసి ఓడిపోయాక అయన కొన్నాళ్ళు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కానీ 2024 ఎన్నికల్ పార్టీ కోసం పని చేసారు తప్ప ఎన్నికల్లో పోటీ చేయలేదు.. దీంతో ఆయన్ను పవన్ కళ్యాణ్ రికమెండేషన్ మీద చంద్రబాబు శాసనమండలి సభ్యునిగా ఎంపిక చేసారు. అయన సభకు ఎంపికైన తరువాత ఇవే మొదటి సమావేశారు.. దీంతో అయన సభకు హాజరయ్యారు.
నాగబాబు 2024 ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేసారు.. దీంతోబాటు పార్టీకి నిధులసేకరణకు సైతం కృషి చేసారు.. ఆంధ్రతోబాటు అమెరికా వంటి దేశాల్లో కూడా పర్యటించి నిధులు సమీకరించారు. అయినా ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండిపోయారు.. చివరకు ఇప్పుడు ఇలా చట్టసభలో అడుగుపెట్టారు.. ఈ సందర్భంగా ఆయన్ను సభ్యులు అభినందించారు. ఇదిలా ఉండగా నాగబాబు మంత్రి అవుతారని అప్పట్లో ఊహాగానాలు వచ్చాయి.. కానీ చంద్రబాబు కేబినెట్ విస్తరణ ఇప్పట్లో జరిగే సూచనలు కనిపించడం లేదు. దీంతో ఆయనకు మంత్రి యోగం ఆలస్యం అయ్యేలా ఉంది.. మరోవైపు పార్టీ సీనియర్ నాయకుడు నాదెండ్ల మనోహర్.. పవన్ కళ్యాణ్ ఇద్దరూ పార్టీ శాసన సభ్యులకు సభలో మెలగాల్సిన నిబంధనలు.. వ్యూహం గురించి వివరించారు.. ఈ మేరకు వారితో పవన్, మనోహర్ సమావేశమై పలు అంశాలపై సూచనలు అందించారు..
\
