
తెలుపు రంగు మాత్రమే ఎందుకు ?
నేటి కాలంలో స్మార్ట్ఫోన్లు మన జీవితంలో విడదీయరాని భాగమైపోయాయి. మరి ఒక్క తెలుపు రంగుకు ఎందుకు అంత ప్రాధాన్యత, ఎప్పుడైనా ఆలోచించారా ? తెలుపు రంగు శుభ్రత, సరళతకు సంకేతం. కాస్త కూల్ లుక్ ఉంటుంది. అందుకే ఇయర్ ఫోన్, చార్జర్, స్విచ్ బోర్డులు తెలుపు రంగులో ఉంటాయి అని అంటే మీ సమాధానం తప్పే, ఎందుకంటే ?
చెప్పాలంటే ఆపిల్ కంపెనీ మొదటిసారిగా వైట్ ఛార్జర్లను బ్రాండ్ ఐడెంటిటీగా మార్చుకుంది. తరువాత మిగతా కంపెనీలు కూడా అదే దారిని అనుసరించాయి.ప్లాస్టిక్ సహజంగానే తెల్లటి షేడ్లో ఉంటుంది. అదనంగా రంగులు వేసే అవసరం లేకుండా కంపెనీలు వైట్ ఛార్జర్లను తక్కువ ఖర్చుతో తయారు చేయగలుగుతున్నాయి. ఐతే ఇది ఒక కారణం మాత్రమే. అసలు సంగతి ఏంటంటే ? చార్జ్ చేస్తే ఛార్జర్ వేడెక్కుతుంది. తెల్లటి ఛార్జర్ వేడిని ఎక్కువగా గ్రహించదు, కాబట్టి అది త్వరగా ఓవర్హీట్ కాకుండా కాపాడుతుంది. నలుపు లేదా ముదురు రంగులు మాత్రం వేడిని ఎక్కువగా ఆకర్షిస్తాయి.తెల్లటి ఛార్జర్పై గీతలు, ధూళి, కాలిన మరకలు తేలికగా కనిపిస్తాయి. దీంతో ఏ సమస్య వచ్చినా వినియోగదారులు త్వరగా గుర్తించగలరు. నలుపు ఛార్జర్లో ఇవి అంతగా కనిపించవు.
చైనాలో కొన్ని కంపెనీలు బ్లాక్, రెడ్, బ్లూ ఛార్జర్లను విడుదల చేశాయి. కానీ సేఫ్టీ, హీట్ ఇష్యూస్ కారణంగా పెద్దగా ఆదరణ దక్కలేదు. తాజాగా కొన్ని కంపెనీలు రాత్రి వేళల్లో సులభంగా కనపడేలా గ్లో ఇన్ ది డార్క్ ఛార్జర్ కేబుల్లు మార్కెట్లోకి తెచ్చాయి.మరి కొన్ని బ్రాండ్లు ఇప్పుడు బయోడిగ్రేడబుల్ మెటీరియల్స్తో ఛార్జర్లు తయారు చేయడం మొదలుపెట్టాయి. ఇవి ఎక్కువగా లైట్ కలర్స్ (తెలుపు, క్రీమ్, లైట్ గ్రే)లోనే వస్తున్నాయి.
