Let's talk: editor@tmv.in
తెలంగాణ అభివృద్ధి జరగాలంటే బీఆర్ఎస్ రావాల్సిందే: కేటీఆర్

తెలంగాణ అభివృద్ధి జరగాలంటే బీఆర్ఎస్ రావాల్సిందే: కేటీఆర్

T Venkata Ramana
17 సెప్టెంబర్, 2025

కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా రేవంత్ రెడ్డి సృష్టించిన భయం కారణంగా హైదరాబాద్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. గత 22 నెలలుగా కాంగ్రెస్ పార్టీ అనుసరించిన ప్రజా వ్యతిరేక విధానాలపై రాష్ట్ర ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని కేటీఆర్ పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ నుంచి బీఆర్ఎస్ విజయయాత్రను తిరిగి ప్రారంభించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికపై బీఆర్ఎస్ సన్నాహక సమావేశం మంగళవారం నిర్వహించింది. కేటీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి పార్టీ సీనియర్ నాయకులు, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.

జూబ్లీహిల్స్లో విజయంపై ధీమా

బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఘన విజయం సాధిస్తుందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. గత 22 నెలలుగా కాంగ్రెస్ పార్టీ అనుసరించిన ప్రజా వ్యతిరేక విధానాలపై రాష్ట్ర ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని ఆయన తెలిపారు. హైదరాబాద్ను తెలంగాణ ఆర్థిక ఇంజిన్గా మార్చిన గత పదేళ్ల తమ ప్రభుత్వ పాలనకు భిన్నంగా, కాంగ్రెస్ పార్టీ విధానాలు నగరాన్ని పూర్తిగా కుప్పకూల్చేలా ఉన్నాయని మండిపడ్డారు.

ఈ విషయాన్ని నగర ప్రజలు గమనిస్తున్నారని కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ అభివృద్ధి కొనసాగాలంటే బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావాల్సిందేనని ప్రజలు భావిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా రేవంత్ రెడ్డి సృష్టించిన భయం కారణంగా హైదరాబాద్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని, అన్ని రంగాలపై కాంగ్రెస్ అసమర్థ విధానాల ప్రతికూల ప్రభావం తీవ్రంగా ఉందని కేటీఆర్ గుర్తు చేశారు. సమాజంలోని అన్ని వర్గాలు కాంగ్రెస్ అసమర్థ విధానాల వల్ల నష్టపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణ అభివృద్ధి జరగాలంటే బీఆర్ఎస్ రావాల్సిందే: కేటీఆర్ - Tholi Paluku