Let's talk: editor@tmv.in
తమ్మిడికుంట పునరుద్ధరణతో ఐటీ కారిడార్‌లో కొత్త ఆకర్షణ

తమ్మిడికుంట పునరుద్ధరణతో ఐటీ కారిడార్‌లో కొత్త ఆకర్షణ

Gaddamidi Naveen
11 నవంబర్, 2025

హైదరాబాద్ ఐటీ కారిడార్‌లోని మాధాపూర్ ప్రాంతంలోని తమ్మిడికుంటను హైడ్రా అధికారులు పునరుద్ధరించడంతో ఇది ప్రాధాన్యతనిచ్చే పర్యాటక ప్రాంతంగా మారుతుంది.చెరువు పరిసరాల పునరుద్ధరణలో మురుగు నీరు,దుర్గంధం తొలగించి,పూడిక,ప్లాస్టిక్ వ్యర్థాలు,ముళ్లపొదలను శుభ్రం చేశారు.చుట్టుపక్కల ప్రదేశాలను విస్తరిస్తూ,చెరువుకు సహజ రూపం తీసుకురావడం జరిగింది.ప్రధాన ప్ర‌వేశ మార్గం తీర్చిదిద్దబడింది.

హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సోమవారం క్షేత్ర స్థాయిలో పునరుద్ధరణ పనులను పరిశీలించారు.చెరువు చుట్టూ బండ్ నిర్మాణం,ఇన్‌లెట్,ఔట్‌లెట్ పనులు,వరద నీరు నిలవకుండా నిర్వహణకు సంబంధించిన సూచనలపై ప్రత్యేక దృష్టి పెట్టారు.14 ఎకరాల చెరువును 29 ఎకరాల విస్తీర్ణంలోకి పెంచడం జరిగిందన్నారు.ఈ విస్తీర్ణంలో నీరు నిలిచేలా చెరువు అభివృద్ధి చేయాలని కమిషనర్ సూచించారు.

అత్యధిక జనసాంద్రత ఉన్న ప్రాంతంలో సేదదీరేలా ఆకర్షణీయ వాతావరణం సృష్టించడానికి చెరువు చుట్టూ ఆక్సిజన్ వాయువు అందించే చెట్లు,చల్లని నీడనిచ్చే మొక్కలు,పార్కులు,ఆట స్థలాలు,వృద్ధుల కోసం రాతి సిమెంట్ కుర్చీలు,ఓపెన్ జిమ్‌లు, చాయాస్థలాలు ఏర్పాటు చేయాలని సూచించారు.ఈ అభివృద్ధి కార్యక్రమంలో అదనపు కమిషనర్ ఎన్ అశోక్ కుమార్,హైడ్రా ఏసీపీ శ్రీకాంత్,ఇతర అధికారులు కమిషనర్‌తో కలసి పాల్గొన్నారు.ఈ పునరుద్ధరణతో తమ్మిడికుంట ప్రాంతం స్థానిక ప్రజల కాదు దేశం న‌లుమూల‌ల నుంచి వ‌చ్చిన ఐటీ నిపుణులు న‌డియాడే ప్రాంతం ఇది.ఆకర్షణీయ ప్రదేశంగా మారనుందని హైడ్రా కమిషనర్ అధికారులకి భవిష్యత్తులో ఈ ప్రాంతం అందరికీ సౌకర్యవంతమైన,శుభ్రమైన,ఆహ్లాదకరమైన వాతావరణంగా ఉండేలా కృషి చేయాలని ఆదేశించారు.