Let's talk: editor@tmv.in
తీన్మార్ మల్లన్న కొత్తపార్టీ

తీన్మార్ మల్లన్న కొత్తపార్టీ

Pinjari Chand
18 సెప్టెంబర్, 2025

బీసీల ఆత్మగౌరవమే ప్రధాన లక్ష్యంగా తీన్మార్ మల్లన్న కొత్తపార్టీని స్థాపించారు. రాజ్యాధికారం కోసం పార్టీని స్థాపిస్తానని, బీసీల కోసం పార్టీ పెట్టాక ఎవరినీ బీఫాం కోసం అడుక్కునే పరిస్థితే ఉండదని చెప్పిన మల్లన్న తాజ్ హోటల్ లో పార్టీ ప్రకటన చేశారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ(టీఆర్ఫీ)ని ప్రకటించారు. దీంతో తెలంగాణ రాజకీయ తెరపైకి మరో పార్టీ వచ్చి చేరింది. అందులో భాగంగా పార్టీ విధి, విధానాలు కూడా ప్రకటించారు. ఈ సందర్బంగా మల్లన్న మాట్లాడుతూ బీసీల ఆత్మగౌరవ జెండా రేపటి నుంచి తెలంగాణ గడ్డ మీద రెపరెపలాడుతుందని తెలిపారు.

బీసీల రాజ్యాధికారం కోసం అందరూ కలిసిరావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్,బీజేపీ నుంచి టికెట్ లు అడుక్కోవడం ఉండదని, 90 శాతం ఉన్న బీసీలకు పార్టీలో ముఖ్యస్థానం ఉంటుందన్నారు. ఈరోజు పెరియార్, విశ్వకర్మల జయంతి ఉన్న రోజున బీసీల తలరాత మారే రోజుగా ప్రకటిస్తున్నట్లు తెలిపారు. బీసీల హక్కుల కోసం ఉద్యమిస్తామని తేల్చిచెప్పారు.బీసీ మేధావి నారగోని చేతుల మీదుగా పార్టీ జెండాను ఆవిష్కరించారు. దేశంలో తొలిసారిగా ఏఐని పార్టీ ప్రతినిధిగా నియమించారు. త్వరలోనే యువతకు కూడా కార్యవర్గంలో స్థానం కల్పిస్తామని మల్లన్న హామీ ఇచ్చారు. పార్టీ ప్రకటన తరువాత రాష్ట్ర స్థాయి కార్యవర్గాన్ని కూడా ప్రకటించారు. తీన్మార్ మల్లన్న అధ్యక్షుడిగా, వర్కింగ్ ప్రెసిడెంట్లుగా మాదం రజినీకుమార్ యాదవ్, సూదగాని హరిశంకర్ గౌడ్లను నియమించారు. ప్రధాన కార్యదర్శులుగా వట్టే జానయ్య యాదవ్, సంగెం సూర్యా రావు, పల్లెబోయిన అశోక్ యాదవ్, జ్యోతి పండల్ బాధ్యతలు చేపట్టనున్నారు.

తీన్మార్ మల్లన్న కొత్తపార్టీ - Tholi Paluku