Let's talk: editor@tmv.in
ఢిల్లీలో బీజేపీ కొత్త కార్యాలయం ప్రారంభం

ఢిల్లీలో బీజేపీ కొత్త కార్యాలయం ప్రారంభం

Pinjari Chand
30 సెప్టెంబర్, 2025

దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి ప్రధాన మంత్రి నరేంద్రమోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా హాజరయ్యారు. సోమవారం ఢిల్లీలోని దీన్​ దయాళ్ మార్గ్​ లో పార్టీ నూతన కార్యాలయం కార్యకర్తలకు, నాయకులకు అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భంగా సీఎం రేఖాగుప్తా మాట్లాడుతూ విరాళాల ద్వారా పార్టీ కార్యాలయ నిర్మాణానికి నిధులు సమకూర్చుకున్నాం. ఇది సేవా సంస్థగా ఉంటుందని అన్నారు. ఆశిష్ సూద్ కొత్త ప్రాంగణాన్ని "పార్టీ కార్యకర్తలు ప్రజలకు సేవ చేయడానికి ప్రేరణ పొందే కేంద్రం" అని అభివర్ణించారు.

అత్యాధునిక సౌకర్యాలతో ఈ కార్యాలయాన్ని తీర్చిదిద్దినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. దేశ రాజధానిలోని నాయకులకు సంస్థాగత కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి వీలుగా నిర్మించారు. అలాగే కొత్త భవనంలో అధునాతన టెక్నాలజీ, కమ్యూనికేషన్ వ్యవస్థలు, సమావేశ మందిరాలు, పార్టీ కార్యక్రమాల కోసం ప్రత్యేక గదులను నిర్మించారు. ఈ భవన నిర్మాణంలో బిజేపీ నిబద్ధత, పనితీరు కన్పిస్తుంది. 27 ఏళ్ల తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. కార్యక్రమంలో మంజీందర్ సింగ్ సిర్సా, ఆశిష్ సూద్, పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ, హర్ష్ మల్హోత్రా, కమల్‌జీత్ సెహ్రావత్, యోగేందర్ చందోలియా, ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా సహా ఇతర నేతలు ఈ వేడుకకు హాజరయ్యారు.

ఢిల్లీలో బీజేపీ కొత్త కార్యాలయం ప్రారంభం - Tholi Paluku