Let's talk: editor@tmv.in
ఢిల్లీలో పేలుడుపై తెలంగాణ నాయకుల ఆవేదన, సమగ్ర విచారణకు డిమాండ్

ఢిల్లీలో పేలుడుపై తెలంగాణ నాయకుల ఆవేదన, సమగ్ర విచారణకు డిమాండ్

Gaddamidi Naveen
12 నవంబర్, 2025

ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు ఘటనలో తెలంగాణ రాజకీయ నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.సమగ్ర దర్యాప్తు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.పేలుడు ఘటనలో ప్రాణనష్టంపై కేంద్ర మంత్రులు జి. కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్‌‌తో పాటు పలువురు ఇతర తెలంగాణ నాయకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సోమవారం రాత్రి 'ఎక్స్' (ట్విట్టర్)లో ఒక పోస్ట్ చేస్తూ, "ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన భయంకరమైన పేలుడులో ప్రాణాలు కోల్పోవడం తీవ్ర ఆవేదన కలిగించింది.మృతుల కుటుంబాలకు నా హృదయపూర్వక సంతాపం తెలియజేస్తున్నాను గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను" అని తెలిపారు.

బండి సంజయ్ కుమార్ ఈ ఢిల్లీ పేలుడును అత్యంత విషాదకరమైనది,హృదయ విదారకమైనదిగా అభివర్ణించారు.కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు ఎన్ఎస్‌‌జీ,ఎన్ఐఏ ఫోరెన్సిక్ బృందాలు అన్ని కోణాల నుంచి సమగ్ర విచారణను ప్రారంభించాయని.సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి,పూర్తి విచారణ జరిపించాలని ఆయన అధికారులను ఆదేశించారని సంజయ్ కుమార్ 'ఎక్స్'లో పేర్కొన్నారు.

ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కారు పేలుడుపై త్వరితగతిన,సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు.ఈ దారుణ చర్యకు పాల్పడిన వారికి చట్టం ప్రకారం కఠిన శిక్ష విధించాలని కోరారు.హైదరాబాద్ ఎంపీ అయిన ఒవైసీ సోమవారం రాత్రి 'ఎక్స్'లో స్పందిస్తూ, ఎర్రకోట సమీపంలో పేలుడు వార్త విని చాలా ఆందోళన చెందాను.గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని,వారిని కోల్పోయిన వారికి ధైర్యం కలగాలని ప్రార్థిస్తున్నాను అని. ఈ ఖండించదగిన చర్యకు బాధ్యులైన వారికి చట్టం ప్రకారం కఠిన శిక్ష విధిస్తారని ఆశిస్తున్నాను అని తెలిపారు.తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అలాగే బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు కూడా ఈ ఘటనలో ప్రాణ నష్టంపై తమ సంతాపం వ్యక్తం చేసి, మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ఢిల్లీలో పేలుడుపై తెలంగాణ నాయకుల ఆవేదన, సమగ్ర విచారణకు డిమాండ్ - Tholi Paluku