
ఢిల్లీలో ఆస్తి వివాదం: తాతపై మనవళ్ల కాల్పులు
దేశ రాజధాని ఢిల్లీలో రెండు వేర్వేరు హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ దారుణ ఘటనలు స్థానికులను కలచి వేశాయి. ఆస్తి పంపకాల్లో తేడా రావడంతో తాతను మనవళ్లు తుపాకీతో కాల్చిన ఉదంతం మంగళవారం ఉదయం జరిగింది. టర్క్ మేన్ గేట్ ప్రాంతంలో 72 ఏళ్ల వృద్ధుడైన షాహబుద్దీన్‌ను ఆయన మనవళ్లు కాల్చి గాయపరిచినట్టు పోలీసులు తెలిపారు. చాలా కాలంగా కుటుంబలో కొనసాగుతున్న ఆస్తి వివాదం నేపథ్యంలో చోటుచేసుకుంది. చాంద్ నీ మహల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనలో గాయపడిన ఆ వృద్ధుడిని స్థానిక ఎల్ఎన్జేపీ ఆసుపత్రికి తరలించారు. ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్టు వైద్యులు చెప్పారు. ప్రాథమిక దర్యాప్తులో కుటుంబ సభ్యుల మధ్య ఆస్తి పంచుకునే విషయంలో తీవ్ర విభేదాలు ఏర్పడినట్లు తేలింది. పోలీసులు హత్యాయత్నం కింద కేసు నమోదు చేసుకుని, నిందితులను పట్టుకునే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.
పటాకుల విషయంలో షాబాద్ డైరీలో మరో హత్య
మరో ఘటనలో, షాబాద్ డైరీ ప్రాంతంలో పటాకులు పేల్చే విషయంలో గొడవలు వచ్చి 35 ఏళ్ల సితాంబర్ ప్రసాద్ అలియాస్ దిలీప్ అనే వ్యక్తి హత్యని చంపేశారు. అక్టోబర్ 20-21 అర్ధరాత్రి సమయంలో ఈ దాడి జరిగిందని పోలీసులు తెలిపారు. దిలీప్‌ను ముగ్గురు-నలుగురు వ్యక్తులు కత్తితో దాడి చేశారు. అలాగే అతని సోదరులైన దీపక్, సందీప్‌లను కూడా కొట్టినట్టు సమాచారం. దీపక్ ప్రసాద్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజీ, టెక్నికల్ సర్వైలెన్స్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు.
విచారణలో నిందితులైన ముగ్గురిని ధీరజ్ (24), ఆకాష్ అలియాస్ బాబా (24), తరుణ్ (22) లను అరెస్ట్ చేశారు. మరో నిందితుడు అజయ్ అలియాస్ అలీ పరారీలో ఉన్నాడు. దీంతో పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు.
