Let's talk: editor@tmv.in
డీఎస్సీ ఉపాధ్యాయుల్ని సత్కరించిన హెంమంత్రి అనిత

డీఎస్సీ ఉపాధ్యాయుల్ని సత్కరించిన హెంమంత్రి అనిత

FL - YUGDR
4 అక్టోబర్, 2025

మొన్నటి డీఎస్సీ ప్రక్రియ విజయవంతం చేసేందుకు విద్యాశాఖ మంత్రి లోకేష్ ఒక తపస్సే చేశారని హోం మంత్రి అనిత కొనియాడారు. గాంధీ జయంతి సందర్భంగా గురువారం ఇటీవల డీఎస్సీలో ఎంపికైన ఉపాధ్యాయుల్ని ఏపీ మంత్రి వంగలపూడి అనిత సత్కరించారు. తొలుత మహాత్మా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వేంపాడు టోల్ ఫ్లాజా సమీపంలో భారతి కన్వెన్షన్ హాల్ లో జరిగిన కార్యక్రమంలో భాగంగా 147 మంది ఉపాధ్యాయుల్ని మంత్రి సన్మానించారు.

వారందరికీ నూతన వస్త్రాలు, శాలువాతో పాటు ఒక్కో మొక్క అందజేశారు. మండలంలోని పీఎల్ పురం గ్రామానికి చెందిన బడుగు ధనలక్ష్మి అనే టీచర్ కు మంత్రి అనిత అపాయింట్ మెంట్ ఆర్డర్ కూడా. అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాబోయే తరాల్ని తయారు చేసే ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు అని అన్నారు. పిల్లల్ని తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదువిస్తారన్నారు. మొన్నటి డీఎస్సీ విషయంలో 140 కోర్టు కేసులు వేశారని, ఏపీ విద్యాశాఖ మంత్రి లోకేష్ ఈ డీఎస్సీ కోసం ఒక తపస్సే చేశారని కొనియాడారు.

ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయకత్వంలో తొమ్మిది డీఎస్సీలు నిర్వహించారని మంత్రి అనిత గుర్తు చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే తాను టీచర్ అయ్యానని పేర్కొన్నారు. 2002లో టీచర్ గా ఉన్నా నన్ను-ఇప్పుడు తన మంత్రివర్గంలో మంత్రిని చేశారని కొనియాడారు. టీచర్ గానే తాను ప్రస్థానం ప్రారంభించాననీ కాబట్టే తాను ఈ స్థాయిలో ఉన్నానన్నారు. పిల్లల భవిష్యత్ ఉపాధ్యాయుల బాధ్యత అన్నారు. ప్రతి విద్యార్ధికి టీచర్ ఒక స్ఫూర్తి అని, ఇక్కడి ఉపాధ్యాయులంతా ఏ పాఠశాలలో జాయిన్ అవుతారో, ఆ పాఠశాలలో తానిప్పుడును అందజేసిన మొక్కను నాటాలని కోరారు. మంత్రి లోకేష్ విద్యావ్యవస్థలో ఎన్నో మార్పులు తీసుకువచ్చారని, పాఠశాల అంటే ఒక దేవాలయం అని భావించి ఎలాంటి సమావేశాలు నిర్వహించకూడదని లోకేష్ నిర్ణయం తీసుకున్నారన్నారు. అనంతరం ఉపాధ్యాయులతో కలిసి మంత్రి అనిత భోజనం చేశారు.

డీఎస్సీ ఉపాధ్యాయుల్ని సత్కరించిన హెంమంత్రి అనిత - Tholi Paluku